
జ్యూట్ బ్యాగులు తయారు చేస్తున్న మహిళలు
కోరుట్లటౌన్: ట్రెండ్ మారుతోంది.. అందరిలో విభిన్నంగా కనిపించాలనే ఆసక్తి పెరుగుతోంది.. ఏ పని చేసినా ప్రత్యేకత చాటుకోవాలనే తపన ఆలోచనల కు పదును పెడుతోంది.. అందులో భాగమే పిల్లలకు లంచ్ బాక్స్‌లు తీసుకెళ్లేందుకు పలు డిజైన్ల జ్యూట్ బ్యాగ్‌లు వినియోగిస్తున్నారు.. కూరగాయలు తె చ్చేందుకూ పర్యావరణ రహిత సంచులు వాడుతున్నారు.. ఉద్యోగులు టిఫిన్‌బాక్స్‌లు తీసుకెళ్లేందుకు జనుము బ్యాగ్‌లు పట్టుకెళ్తున్నారు.
శుభకార్యాల్లో గిఫ్ట్‌లు అందజేసేందుకూ జనుముతో తయారైన కవర్లు వినియోగించడం ప్రజల్లో వస్తున్న మార్పులకు అద్దంపడుతున్నాయి.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కోరుట్లలోని కొన్ని మహిళా సంఘాలు.. జనుముతో ఆకట్టుకునే బ్యాగ్‌లు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో తామూ పాలుపంచుకుంటున్నాయి.
రూ.7లక్షల రుణం..
● మున్సిపల్ పరిధిలోని మెప్మా అధికారుల చేయూతతో బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు రూ.7 లక్షలు రుణం మంజూరు చేశారు. ఇందులో ప్రధానంగా అమన్ స్వశక్తి మహిళా సంఘంలోని 10 మంది సభ్యులు మూడు ఏళ్ల క్రితం జ్యూట్ బ్యాగుల తయారీ పరిశ్రమ స్థాపించారు. ప్రస్తుతం ఏడుగురు మహిళలు పట్టుదలతో పనిచేస్తూ, జ్యూట్ బ్యాగులు తయారు చేస్తున్నారు. వారితోపాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రోజూ సుమారు వంద బ్యాగులు తయారు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ముడి సరుకులు..
● జ్యూట్ బ్యాగుల తయారీకి అవసరమైన ముడిసరుకులను హైదరాబాద్ నుంచి మహిళలు తెప్పించుకుంటున్నారు.
● ఇందులో జనపనార రోల్స్, జిప్‌లు, మెటీరియల్స్, ప్రింటెడ్ పేపర్ కలర్స్ ఉంటున్నాయి.
● ఇలా తీసుకొచ్చిన ముడిసరుకులతో పలువురు మహిళలు ఆకర్షణీయమైన విజైన్లలో బ్యాగులు అందంగా తయారు చేస్తున్నారు.
● ఒక్కో సంచి నాణ్యతను, మన్నికను, డిజైన్‌ను బట్టి రూ.40 నుంచి మొదలుకుని రూ.50, రూ.100, రూ.200, రూ.300, రూ.400, రూ.500 వరకు ధర పలుకుతున్నాయి.
ఉచితంగా కుట్టు మిషన్లు..
పట్టణంలో అమన్ స్వశక్తి మహిళా సంఘం సభ్యులు తొలుత జ్యూట్ బ్యాగుల తయారీకి పూనుకున్నారు. వీరికి శిక్షణ ఇప్పించేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సాయం చేశారు. పట్టణంలో ఓ షెడ్డు నిర్మింపజేశారు. ఉచితంగా కుట్ట మిషన్లు అందజేశారు. మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగుల తయారీ కోసం 30 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి
పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మా ర్చేందుకు మెప్మా ఆధ్వర్యంలో మ హిళా సమాఖ్య సంఘా ల సభ్యులు తమవంతు బాధ్యత తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ సంచులు వాడొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. జ్యూట్ బ్యాగుల ఉపయోగాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 2 వేల మందికిపైగా కొనుగోలు చేశారు. ప్రణాళిక బ ద్ధంగా అన్ని సమాఖ్యల ద్వారా జ్యూట్ బ్యాగులు వాడకం పెరిగితే, జ్యూట్ పరిశ్రమలో మహిళలకు మరింత ఉపాధి దొరికే అవకాశాలు మెరుగవుతాయి.
