‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తికావాలి | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తికావాలి

Oct 22 2025 7:12 AM | Updated on Oct 22 2025 7:12 AM

‘ఇంది

‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తికావాలి

రాయికల్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మండలంలోని సింగరావుపేట, శ్రీరాంనగర్‌, ఇటిక్యాలలో ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనం, హెల్త్‌ సెంటర్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు మొదలుపెట్టని వారికి సమస్యలు ఉంటే పరిష్కరించాలని, ఆర్థికంగా ఇబ్బంది పడితే సెర్ప్‌ ద్వారా రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, ఈఈ పీఆర్‌ లక్ష్మణ్‌రావు, హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్‌ నాగార్జున పాల్గొన్నారు.

గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం

ధర్మపురి: గోదావరి పుష్కరాలను నభూతో న భవిష్యత్‌ తరహాలో నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని దర్శించుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. 2027లో వచ్చే పుష్కరాలకు నిధుల మంజూరుకు సీఎం దృష్టికి తీ సుకెళ్లానని తెలిపారు. ధర్మపురిలో డిగ్రీ కళా శా ల రావడంతో నిజమైన దీపావళి వచ్చినట్లయ్యిందన్నారు. అలాగే బస్‌డిపో, రూ.200 కో ట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మించబోతున్నామ ని తెలిపారు. అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపణలు చేస్తున్నార ని తెలిపారు. కార్యక్రమంలో ఈవో శ్రీని వాస్‌, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ జక్కు రవీందర్‌, నా యకులు దినేష్‌, వేముల రాజు, సుముఖ్‌ ఉన్నారు.

జగన్నాథ్‌పూర్‌ బ్రిడ్జి మంజూరుకు కృషి

రాయికల్‌: గిరిజనుల రాకపోకలు మెరుగుపర్చేందుకు జగన్నాథ్‌పూర్‌ వద్ద బ్రిడ్జి మంజూ రుకు కృషి చేసినట్లు మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. తన ప్రోద్బలంతోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తొలి సంతకం బ్రిడ్జి మంజూరు పత్రంపై పెట్టారని గుర్తుచేశారు. మండలంలో ని జగన్నాథ్‌పూర్‌లో గిరిజనులతో కలిసి దండారీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు.. తాను ఎమ్మెల్యేగా బోర్నపల్లి బ్రిడ్జిని మంజూరు చేయించానని పేర్కొన్నారు. వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు భూమి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్‌గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్‌రెడ్డి, ఆంజనేయులు, శంకర్‌, బీర్సాబ్‌, సిడెం భీం, మారుతి, సచిన్‌, తలారి రాజేశ్‌, బాపురపు రాజు, గుమ్మడి సంతోష్‌, లక్ష్మణ్‌, రాజిరెడ్డి పాల్గొన్నారు.

మద్యం షాపులకు 1840 దరఖాస్తులు

జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకు ఇప్పటివరకు 1840 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తెలిపారు. వాస్తవానికి టెండర్లకు ఈనెల 18న గడువు ముగిసినా.. బీసీ సంఘాల బంద్‌, బ్యాంక్‌లకు సెలవులు ఉండటంతో ప్రభుత్వం ఈనెల 23 వరకు గడువు పెంచింది. దీంతో మంగళవారం మరో ఆరు దరఖాస్తులు రాగా.. మొత్తం 1840కు చేరాయి.

‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తికావాలి1
1/2

‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తికావాలి

‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తికావాలి2
2/2

‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తికావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement