
శాంతియుత సమాజమే లక్ష్యం
జగిత్యాలక్రైం: శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యమని, శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమ ని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నా రు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా మంగళవారం పోలీస్ అమరులను స్మరించుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అధి కారులు, అమరుల కుటుంబసభ్యులతో కలిసి నివా ళి అర్పించారు. అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ఈనెల 31వరకు వివిధ కార్యక్రమాలు చేపడతా మని పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు సహకారం అందిస్తామన్నారు. శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్ష, సేవాతత్పరతతో పనిచేస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో ఓపెన్‌హౌస్ నిర్వహించి పోలీసు విధులు, సాంకేతి క వినియోగం, ప్రజారక్షణలో సేవలు, ఫ్రెండ్లీ పోలీ స్ వ్యవస్థపై స్కూల్ పిల్లలకు తెలియజేస్తామన్నా రు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫొటోగ్రఫీ, రక్తదాన శిబిరాలు, సైకి ల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, వెంకటరమణ, రాములు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, సైదులు, సీఐలు వేణుగోపాల్, సుధాకర్, రవి, రాంనర్సింహారెడ్డి, ప్రవీణ్, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

శాంతియుత సమాజమే లక్ష్యం

శాంతియుత సమాజమే లక్ష్యం

శాంతియుత సమాజమే లక్ష్యం