బందీలుగా ఉన్న కమాండర్లను విడిపించుకున్న ఉక్రెయిన్.. 

Zelensky Brings Home Former Commanders From Turkey - Sakshi

క్యీవ్: శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ టర్కీలో ఉన్న వారి తమ కమాండర్లు ఐదుగురిని విడిపించి తిరిగి సొంత దేశానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో టర్కీ ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని క్రెమ్లిన్ వర్గాలు మండిపడుతున్నాయి.  

మారియోపోల్ వీరులు.. 
వీరంతా రష్యా ఆక్రమించుకున్న అతిపెద్ద ప్రాంతం మారియోపోల్ రక్షణ శాఖకు నాయకత్వం వహించారు. అక్కడ రష్యాతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడినా కూడా ఫలితం లేకపోయింది. హోరాహోరీగా సాగిన యుద్ధంలో రష్యా పైచేయి సాధించి మారియోపోల్ ను ఆక్రమించుకుంది. 

ఒప్పందంపై టర్కీకి.. 
దీంతో అనేకమంది ఉక్రెయిన్ సైనికులు అజోవ్ త్సవ్ స్టీల్ ప్లాంటు కింద సొరంగంలో దాక్కున్నారు. గతేడాది మేలో ఉక్రెయిన్ వీరిని లొంగిపొమ్మని ఆదేశించడంతో వీరంతా రష్యా దళాలకు లొంగిపోయి బందీలుగా వెళ్లారు. సెప్టెంబరులో వీరిని అంకారాకు బదిలీ చేస్తూ యుద్ధం ముగిసే వరకు విడిచి పెట్టవద్దని ఖైదీల మార్పిడి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 

శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ టర్కీ అధ్యక్షుడితో చర్చలు జరిపి అనంతరం సింహాలుగా పిలవబడే ఈ ఐదుగురు కమాండర్లను ఉక్రెయిన్‌కు తిరిగి రప్పించారు. అనంతరం జెలెన్‌స్కీ టర్కీ అధ్యక్షుడికి కృతఙ్ఞతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని ఉల్లంఘించి వీరిని విడిచిపెట్టడం అనైతికమని క్రెమ్లిన్  ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ టర్కీపై త్రీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.  

ఇది కూడా చదవండి: మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్‌కు సాయంపై బైడెన్ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top