
అవును మరి.. ఇది అద్భుతమే.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారిగా పేరొందిన అటకామా.
చూశారుగా.. నిజంగానే ఎడారా అని అనుమానం కలిగేలా.. పూలతో నందనవనాన్ని తలపిస్తోంది. ఇక్కడ వర్షం అరుదు. ఏడాదికి సగటు వర్షపాతం 15 మిల్లీమీటర్లు.. చాలా ప్రాంతాల్లో అది కూడా పడదు. అయితే, ఎప్పుడూ లేనంతగా కుండపోత వర్షం కురిసినప్పుడు.. ఎడారి మురిసిపోతుంది.. విరులతో ఇలా మెరిసిపోతుంది. ఈ చిత్రాలను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 5–7 ఏళ్లకోసారి అటకామాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంటుందట.
చదవండి: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో తెలుసా?