World Car Free Day: ఎంచక్కా  సైకిల్‌పై షికారు చేద్దాం!

 World Car Free Day 2021: History, Significance details here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోజుకు రోజుకు కాలుష్యం పెను భూతంలా విస్తరిస్తోంది. విచ్చలవిడిగా విడుదలవుతున్న కర‍్బన ఉద్గారాలు భూతాపాన్ని మరింత పెంచేస్తున్నాయి.  ఫలితంగా ఈ భూ ప్రపంచంపై మానువళి మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది.  ఈ పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు వచ్చిందే వరల్డ్‌ కార్‌ ఫ్రీ డే. ప్రతీ ఏడాది సెప్టెంబర్ 22 న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ విశేషాలేంటో మీకోసం

వరల్డ్‌ కార్‌ ఫ్రీ డే.  అంటే వాహనదారులు ఈ ఒక్కరోజు కార్లను పక్కనపెట్టేసి మన కాళ్లకు పని చెప్పడన్నమాట. నడుచుకుంటూ వెళ్లడమో లేదంటే ఎంచక్కా  సైకిళ్లనో, లేదా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం. తద్వారా పర్యావరణ వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. దీని వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేసేలా ప్రతీ ఏడాది ఈ డేను పాటించడం ఆనవాయితీగా  వస్తోంది.

యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఆ ఈవెంట్ పౌరులకు  కారులేకుండా వెళ్లడాన్ని పోత్సహిస్తుంది. సురక్షితమైన వాతావరణంలో నడక సైక్లింగ్‌ను ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది.  ఫ్రాన్స్‌లోని పారిస్‌లో  సెప్టెంబర్ 2015న ఈ డేను పాటించగా ఉద్గార ప్రభావం 40 శాతం తగ్గిందట.ముఖ్యంగా మనం రోజూ వాడే కార్లు, బైక్స్ నుంచి విడుదలయ్యే ఉద్గారాలు మొత్త కాలుష్యంలో 8శాతాన్ని ఆక్రమించాయంటేనే  కాలుష్యతీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

1990ల నుండి ఐస్‌ల్యాండ్, యూకే మొదలైన దేశాలలో ఈ డేనునిర్వహిస్తుండగా, 2000లో కార్బస్టర్స్ (వరల్డ్ కార్‌ఫ్రీ నెట్‌వర్క్) ప్రారంభించిన వరల్డ్‌ కార్-ఫ్రీ డేతో ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా ఆయా సిటీ ప్లాన్లరు, రాజకీయ నాయకులు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2007లో, ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, తన మొదటి కార్-ఫ్రీ డేని నిర్వహించింది. అంతేకాదు మే 2012 నుండి జకార్తాలో ప్రతి ఆదివారం కార్ రహిత దినోత్సవం నిర్వహించడం విశేషం.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top