WHO says Omicron subvariant XBB.1.5 increasing rapidly - Sakshi
Sakshi News home page

25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్.. డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్..

Jan 7 2023 2:57 PM | Updated on Jan 7 2023 3:35 PM

25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ కేసులు.. డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్.. - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది.  ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దీని ముప్పు గురించి తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పింది.

ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ ప్రపంచానికి కొత్త ముప్పుగా పరిణమించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో గత ఏడాది డిసెంబర్‌లో ఈ వేరియంట్ వల్లే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ  కేసులు నమోదవుతున్నాయి.

భారత్ బేఫికర్..
మరోవైపు భారత్‌లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.01గా ఉంది. ప్రస్తుతం 2,509 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.8శాతంగా ఉంది.
చదవండి: చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్‌ లేక నేలపైనే రోగులకు చికిత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement