
కీవ్: ఉక్రెయిన్‌లోని ఆక్రమిత తీర ప్రాంత నగరం మేరియుపోల్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకస్మికంగా పర్యటించారు. సెప్టెంబర్‌లో తమ సైన్యం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక పుతిన్ మొదటిసారిగా అక్కడికి వెళ్లారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి.
హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్న పుతిన్, సొంతంగా వాహనం నడుపుతూ నగరంలోని స్మారకప్రాంతాలను సందర్శించారు. పుతిన్ శనివారం మేరియుపోల్‌కు దగ్గర్లోనే ఉన్న క్రిమియాకూ వెళ్లారు.