ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు: వీడియో వైరల్‌

Viral Video: Students Walkout At The Schools White Coat Ceremony  - Sakshi

అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయం మెడికల్‌ స్కూల్‌లో వైట్‌కోట్‌ వేడుక జరుగుతోంది. ఈ సందర్భంగా వేదికపై డాక్టర్‌ క్రిస్టిన్‌ కొలియర్‌ అనే ప్రముఖ వైద్యుడు ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగం ఇలా ప్రారంభం కాగానే ఒక్కసారిగా విద్యార్థులంతా లేచి బయటకు వచ్చేశారు. దీంతో ఆ వేడుకకు వచ్చిన ప్రముఖులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

నిజానికి వైట్‌ కోట్‌ అనేది అధికారిక కార్యక్రమం. ఇది విద్యార్థులంతా వైద్య రంగంలోకి ప్రవేశించినందుకు గుర్తుగా వారందరికీ వైట్‌కోట్‌లు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ వైద్యుడిని ప్రధాన అతిధిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ...దాదాపు 340 మంది విద్యార్థులు యూనివర్సిటీ డీన్‌కి ఒక పిటిషన్‌ అందజేశారు కూడా. వాస్తవానికి వైద్యుడు కొలియర్‌ సోషల్‌ మీడియాలోనూ, పలు ఇంటర్వ్యూల్లోనూ అబార్షన్‌కి వ్యతిరేకంగా పలు ఉపన్యాసాలు ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆయన పట్ల వ్యతిరేక భావం ఏర్పడింది.

దీంతో కొత్తగా వైద్యారంగంలోకి వచ్చిన విద్యార్థులు, పూర్వపు విద్యార్థులతో సహా సుమారు 72 మంది కమ్యూనిటీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్‌ పై సంతకాలు చేశారు. అంతేగాదు అబార్షన్‌కి వ్యతిరేకంగా ప్రసంగిస్తూ ....విశ్వవిద్యాలయాల స్థితిని దిగజార్చారు, పైగా వైద్య విధానంలో ఒక వ్యక్తి ప్రాణ రక్షణ నిమిత్తం అబార్షన్‌ చేయడం లేదా చేయించుకోవడం అనేది ఒక భాగం అంటూ.... ఆయన ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పిటిషన్‌లో విద్యార్థులు పేర్కొన్నారు.

(చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం... ఇద్దరు మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top