బెడిసికొట్టిన అమెరికా ప్రయత్నం
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్‌లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్‌కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్‌మూద్ అహ్మదినెజాద్‌కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది.
ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు.
దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్‌ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్‌ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి.


