Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌ | Top 10 Telugu Latest Current News Headlines Today 10th April 2022 5PM | Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Apr 10 2022 8:53 PM | Updated on Apr 10 2022 9:42 PM

Top 10 Telugu Latest Current News Headlines Today 10th​ April 2022 5AM - Sakshi

 ఆర్టీసీ బస్‌ రూటు ఎటు?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అతి పెద్ద ఆర్టీసీ రీజియన్‌ రాజమహేంద్రవరం. జిల్లాల పునర్విభజన తరువాత ఈ జిల్లా మూడు జిల్లాలవ్వడంతో  రాజమహేంద్రవరం రీజియన్‌ విభజనపై ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


ఒక్కోసారి మా మీద మాకే డౌట్‌ వస్తుంది.. మూడు విభాగాల్లోనూ..
‘‘బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌... మూడు విభాగాల్లో మేము చాలా మెరుగుపడాల్సి ఉంది. కొంత మంది కీలక ఆటగాళ్లు జట్టుతో లేని లోటు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాం’’ అని ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అన్నాడు.

హాలీవుడ్‌ మూవీ రేంజ్‌.. స్మగ్లర్లను ఛేజ్‌ చేసి పట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్‌

తన హత్య కేసును తనే రీ ఓపెన్‌ చేయించుకున్న ఆత్మ?! అసలేం జరిగింది?
‘మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?’ సమాధానం దొరకని ప్రశ్న! అయితే ‘ఆత్మ అమరం’ అని నమ్మేవారు అశరీరవాణికి పెద్దపీట వేస్తారు. దెయ్యాలు, పిశాచాలు, సైతాన్లు.. ఇలా కంటికి కనిపించని అతీంద్రియ శక్తులను బలంగా నమ్ముతారు. అలాంటివారి నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ గ్రీన్‌ బ్రియర్‌ ఘోస్ట్‌ మిస్టరీ.

‘ఆదిపురుష్‌’నుంచి స్పెషల్‌ వీడియో.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌
ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ‘ఆదిపురుష్‌’ ఒకటి. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తగ్గేదేలే.. పుతిన్‌ సంచలన నిర్ణయం
ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లో 40 రోజులకుపైగా జరుగుతున్న యుద్దంలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా ఇరువర్గాలు తమ సైనిక బలగాలను చాలా వ‌ర‌కు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో సామాన్య పౌరులపై పాటుగా సైనికులు కూడా మృత్యువాతపడ్డారు. 

 ఏపీ నూతన కేబినెట్‌.. కొత్త మంత్రులు వీరే..
ఆంధ్రప్రదేశ్‌ కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. 

బూతులు మాట్లాడుతున్నావేంటి? మాస్టర్‌పై నాగార్జున సీరియస్‌
సాధారణంగా బిగ్‌బాస్‌ షోలో సండే అనగానే ఫండే అంటూ ఎపిసోడ్‌ స్టార్ట్‌ చేస్తాడు నాగార్జున. కానీ బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ షోలో మాత్రం ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ రెండూ చూపిస్తాడు. ఇక ఈ వారం అయితే ఎన్నడూ లేనంతగా సీరియస్‌ అయ్యాడు. హౌస్‌మేట్స్‌ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

ఆన్‌లైన్‌ పరిచయం.. అసభ్యకర వీడియోలను అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించడంతో..
సోషల్‌ మీడియాలో పరిచయమైన అపరిచిత యువకుడు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధిస్తున్నాడని ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శికారిపుర తాలూకా శిరాళకొప్పలో జరిగింది. బీఏ చదువుకున్న 23 ఏళ్ల యువతికి ఇన్‌స్టా గ్రామ్‌లో అపరిచిత వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎప్పుడూ ఫోన్‌ చేస్తుండేవాడు. యువతి నగ్న వీడియో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించేవాడు.

ఎవరైనా వావ్ అనాల్సిందే, ఏసీకి దీటైన ఫ్యాను..ధర ఇంత తక్కువా!
గదిలో ఈ ఫ్యాను ఉంటే చాలు, ఇక ఏసీ అవసరమే ఉండదు. వేసవిని చల్లగా ఆస్వాదించవచ్చు. అమెరికన్‌ కంపెనీ ‘ఇగో పవర్‌ ప్లస్‌’ రూపొందించిన ‘మిస్టింగ్‌ ఫ్యాన్‌’ ఇది. దీని పనితీరు దాదాపు ఎయిర్‌ కూలర్‌ మాదిరిగా ఉన్నా, ఇది ఎయిర్‌ కండిషనర్‌ కంటే సమర్థంగా పనిచేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement