హాలీవుడ్‌ మూవీ రేంజ్‌.. స్మగ్లర్లను ఛేజ్‌ చేసి పట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్‌

Cattle Smugglers Were Arrested After High Speed Chase  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్‌ ముఠాను గురుగ్రామ్‌ పోలీసులు అర్ధరాత్రి ఛేజ్‌ చేసి పట్టుకున్నారు. దొంగలను పట్టుకునేందు పోలీసులు.. హాలీవుడ్‌ మూవీ రేంజ్‌లో రోడ్డుపై లారీని ఛేజ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

వివరాల ప్రకారం.. ఐదుగురు పశువుల స్మగ్లర్లు గోవులను అక‍్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు. అయితే, స్మగ‍్లర్లు ఢిల్లీ బోర్డర్‌ నుండి గురుగ్రామ్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు లారీని ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిపో​యారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఛేజింగ్‌ చేసిన తర్వాత వారిని పట్టుకున్నారు. 

ఛేజ్‌ చేసే క్రమంలో పోలీసులు.. స్మగ్లర్ల లారీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్ల్లో లారీ టైర్‌ పేలిపోయినప్పటికీ వారు వాహనాన్ని మాత్రం ఆపలేదు. కాగా, లారీ పట్టుకున్న తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లారీలో తనిఖీలు చేపట్టగా అందులో తుపాకులు, బుల్లెట్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆవుల స్మగ్లర్లు గురుగ్రామ్‌లో భీభత్సం సృష్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. హర్యానా ప్రభుత్వం ఆవుల స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించినప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పశువుల అక్రమ రవాణా పెరుగుతూనే ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top