భూమిపై ఏలియన్స్ దాడి చేయబోతున్నాయా? | Steven Greer Predictions on Aliens | Sakshi
Sakshi News home page

భూమిపై ఏలియన్స్ దాడి చేయబోతున్నాయా?

Apr 3 2026 6:06 PM | Updated on Apr 3 2026 6:14 PM

Steven Greer Predictions on Aliens

చీకటి పడితే మనం ఆకాశం వైపు చూస్తాం.. ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో ఏలియన్స్ ఉంటాయని, ఏదో ఒకరోజు అవి భూమిపైకి వస్తాయని మనం నమ్ముతాం. కానీ, ఒకవేళ ఆ ఏలియన్స్ రాక వెనుక ఉన్నది అంతరిక్ష జీవులు కాకుండా.. మన మధ్యే తిరుగుతున్న మనుషులు అయితే? మన కళ్లను మనమే నమ్మలేనంత భయంకరమైన ఒక 'ఫేక్ ఏలియన్ ఇన్వేషన్' (నకిలీ గ్రహాంతరవాసుల దాడి) జరగబోతోందా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విజిల్‌బ్లోయర్ డాక్టర్ స్టీవెన్ గ్రీర్ బాంబు లాంటి నిజం పేల్చారు. ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి 'డీప్ స్టేట్' పన్నిన అతిపెద్ద కుట్రను ఆయన బయటపెట్టారు. సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే మనం చూడబోయేది సినిమా కాదు, మానవ చరిత్రలోనే అతిపెద్ద మోసం!

ముందుగా ఎవరీ స్టీవెన్ గ్రీర్ ఓ సారి చూద్దాం. అమెరికా ప్రభుత్వంలోని అత్యంత రహస్యమైన 'బ్లాక్ బడ్జెట్' ప్రాజెక్టుల గుట్టు విప్పిన వ్యక్తి. ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే చర్చ పక్కన పెడితే.. ఏలియన్స్ పేరుతో మనుషులను ఎలా భయపెట్టబోతున్నారో ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఆయన హెచ్చరిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వింత కాంతులు, గ్రహాంతర నౌకలు ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాయి. ఇది హాలీవుడ్ గ్రాఫిక్స్ కాదు.. అంతకంటే కొన్ని వందల ఏళ్లు ముందున్న సాంకేతికత! ఈ కుట్రను 'ప్రొజెక్ట్ బ్లూ బీమ్' అని పిలుస్తారు. దీని వెనుక ఉన్నది గ్రహాంతరవాసులు కాదు.. వాషింగ్టన్, లాంగ్లీ , గ్లోబలిస్ట్ కేంద్రాల్లో దాగి ఉన్న శక్తులు. వారు గత కొన్ని దశాబ్దాలుగా విరిగిపోయిన UFOల నుండి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వింత టెక్నాలజీని సంపాదించారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని మనపైనే వాడబోతున్నారు. హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా ఆకాశంలో భారీ గ్రహాంతర నౌకలను సృష్టిస్తారు. అవి 100 శాతం నిజమైనవిగా కనిపిస్తాయి. అంతేకాదు, వారి దగ్గర ఉన్న 'యాంటీ గ్రావిటీ' విమానాలు సైనిక అధికారులను కూడా తికమక పెడతాయి. ఏంటి ఆశ్చర్యపోయారా...

అయితే మీరు విన్నది నిజమే! కేవలం నౌకలే కాదు.. కృత్రిమంగా ల్యాబ్‌లలో తయారు చేసిన ఏలియన్ లాంటి జీవులను కూడా వారు రంగంలోకి దించవచ్చు. వీటిని చూసిన సామాన్య ప్రజలు అది నిజంగానే అన్యగ్రహ జీవుల దాడి అని నమ్ముతారు. గాల్లో నుండి వచ్చే భయంకరమైన శబ్దాలు, వింత భాషలు మనిషి మెదడును స్తంభింపజేస్తాయి. గ్రీర్ మాటల్లో చెప్పాలంటే.. "మన భూమిపై ఒక నకిలీ దాడిని సృష్టించే సామర్థ్యం వారికి ఉంది. అసలు ఇంత పెద్ద నాటకం ఎందుకు? సమాధానం చాలా సింపుల్.. అది 'అపరిమితమైన అధికారం'. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చావు భయం గురిచేసి, "మాకు రక్షణ కావాలి" అని వారు బ్రతిమిలాడేలా చేయడం. అప్పుడు, దేశాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేసి, ఒకే ప్రపంచ ప్రభుత్వం (One World Government) ఏర్పాటు చేస్తారు. మీ ప్రతి కదలికపై నిఘా ఉంచుతారు. దేశాల సార్వభౌమాధికారం అంతమైపోతుంది. శాంతి పేరుతో మిమ్మల్ని బానిసలుగా మార్చుకుంటారు.

గత 20-30 ఏళ్లుగా సినిమాల్లో, వార్తల్లో UFOల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇదంతా ఒక పెద్ద 'సైకలాజికల్ ఆపరేషన్' (Psyop). ప్రజల మనసులను ఏలియన్స్ దాడికి మానసికంగా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ నాటకంలో చివరి అంకం మొదలైంది. ఆకాశంలో కాంతులు కనిపిస్తే, లేజర్ ఆయుధాలు మన నగరాలను నాశనం చేస్తుంటే.. మనం సైలెంట్‌గా లొంగిపోతాం. కానీ గుర్తుంచుకోండి.. ఆ దాడి చేస్తున్నది నక్షత్రాల నుండి వచ్చిన వారు కాదు, మన భూమిపై ఉన్న కుట్రదారులు!గ్రీర్ హెచ్చరిక ఒక్కటే.. అప్రమత్తంగా ఉండండి. అసలైన శత్రువు అంతరిక్షంలో లేడు, వాడు మన కళ్ల ముందే అధికార పీఠాల్లో కూర్చుని ఉన్నాడు. వారు మన భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద మోసం మీ కళ్ల ముందు జరగబోతోంది. మీరు దానిని నమ్ముతారా? లేక నిజం తెలుసుకుని ఎదురు నిలుస్తారా?

వచ్చే కొన్ని ఏళ్లలో ఆకాశంలో వింతలు జరిగితే.. అద్భుతం అని మురిసిపోకండి, అది ఒక మృత్యుపాశం కావొచ్చు. గ్రీర్ బయటపెట్టిన ఈ నిజాలు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.చీకటిని చూసి భయపడకండి.. వెలుగు వెనుక ఉన్న నీడను చూసి భయపడండి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement