
పెరూ పురాతన నాగరికతకు నిలయం. ముఖ్యంగా మచుపిచు వంటి ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇది వివిధ జాతుల సమూహాల మిశ్రమం. అలాంటి పెరూలో మరో ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది. పురావస్తు శాస్త్రవేత్తలు.. పెరూలోని ఉత్తర బరాంకా ప్రావిన్స్‌లో ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు. ఇది 3,500 సంవత్సరాల పురాతనమైన పెనికో అనే నగరంగా గుర్తించారు.
పసిఫిక్ తీరప్రాంతంలో ఆదిమ సమాజాలను ఆండీస్ పర్వతాలు, అమెజాన్ బేసిన్‌లో నివసించే వారితో అనుసంధానించే కీలక వాణిజ్య కేంద్రంగా ఇది పనిచేసిందని నమ్ముతున్నారు. లిమాకు ఉత్తరాన 200 కి.మీ దూ రంలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది మధ్యప్రాచ్యం, ఆసియాలో ఆదిమ నాగరికతలు అభివృద్ధి చెందుతున్న సమయంలో క్రీస్తుపూర్వం 1,800–1,500 మధ్య స్థాపించిందై ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నగరానికి సంబంధించిన డ్రోన్ ఫుటేజ్‌ను కూడా పరిశోధకులు విడుదల చేశారు. ఇందులో నగర కేంద్రంలోని కొండవాలు టెర్రస్‌పై వృత్తాకార నిర్మాణం కనిపిస్తోంది. దాని చుట్టూ రాతి, మట్టి భవనాల అవశేషాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎనిమిదేళ్లపాటు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు 18 నిర్మాణాలను వెలికితీశారు. వాటిలో దేవాలయాలు, ఇళ్లు కూడా ఉన్నాయి.
భవనాల్లో పండుగలకు ఉపయోగించే వస్తువులు, మనుషులు, జంతువుల బొమ్మ లు, మట్టి శిల్పాలు, పూసలు, సముద్రపు గవ్వలతో తయారు చేసిన హారాలు ఉన్నాయి. పెరూలోని సూప్ లోయలో 5వేల ఏళ్లకిందటి అమెరికా ఖండాల్లో అత్యంత పురాతనమైన నాగరికతగా గుర్తింపు పొందిన కారల్ ఉన్న ప్రదేశానికి సమీపంలో పెనికో ఉంది. ఇక, కారల్‌లో 32 స్మారక చిహ్నాలు ఉన్నా యి. వాటిలో పెద్ద పిరమిడ్ నిర్మాణాలు, అధునాతన నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయం, పట్టణ స్థావరాలు ఉన్నాయి.
ఇది భారత్, ఈజిప్ట్, సుమేరియా, చైనాలోని ఇతర ఆదిమ నాగరికతల సమ యంలోనే విడిగా అభివృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వాతావరణ మార్పుల వల్ల కారల్ నాగరికత క్షీణించిన తర్వాత దాని పరిస్థితి ఏమిటనేది అర్థం చేసుకోవడానికి పెనికో ఆవిష్కరణ పనికొస్తుందని 1990లలో పెనికోపై ఇటీవలి పరిశోధనలు, కారల్ తవ్వకాలకు నాయకత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ రూత్ షాడీ తెలిపారు. సముద్ర తీరంలో, ఎత్తైన ప్రాంతంలో ఉన్న పెనికో.. ఆ కాలంలో అడవుల్లో జీవిస్తున్న సమాజాల ప్రజల వాణిజ్యానికి, వస్తు మారి్పడికి ఉపయోగించే విధంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందని చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్