బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్ చేసిన పుతిన్ ఏజెంట్లు.. రష్యా చేతికి కీలక రహస్యాలు!

Russian Agents Hacked Former Uk Pm Liz Truss Phone - Sakshi

లండన్‌: బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ వ్యక్తిగత ఫోన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం పనిచేసే ఏజెంట్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. మిత్ర దేశాలతో లిజ్ మాట్లాడిన సంభాషణలతో పాటు ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్‌ పంపుకున్న సందేశాలు వంటి కీలక రహస్యాలు రష్యా చేతికి చిక్కినట్లు డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది. ట్రస్ ప్రధాని ఎన్నికల ‍ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే రష్యా ఏజెంట్లు ఫోన్ హ్యాక్ చేసినట్లు పేర్కొంది.

ట్రస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఆమె క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. ఈ ఫోన్ హ్యాక్ చేసిన రష్యాకు బ్రిటన్ రహస్యాలు తెలిశాయని డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆయుధ సరఫరా, మిత్ర దేశాలతో సంబంధాలతో పాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆమె వివర్శించిన సంభాషణలు కూడా పుతిన్ చేతికి చేరినట్లు వెల్లడించింది. ఇతర దేశాలకు కీలక సమాచారం చిక్కడంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చని తెలిపింది.

లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యూకే చరిత్రలోనే అతితక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఆమే కావడం గమనార్హం. పదవి చేపట్టాక దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం, మంత్రులు రాజీనామా చేయడంతో లిజ్ ట్రస్ స్వతహాగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రిషి సునాక్ ఎలాంటి పోటీ లేకుండా బ్రిటన్ ప్రధాని అయ్యారు.
చదవండి: ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top