బ్రిటన్లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్‌!

Rishi Sunak Plans Curbs On Foreign Students To Control Migration - Sakshi

లండన్‌: బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల రూపంలో పోటెత్తుతున్న వలసల కట్టడికి ప్రధాని రిషి సునాక్‌ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగువ శ్రేణి డిగ్రీ చదివేందుకు, డిపెండెంట్లుగా ఉండేందుకు వస్తున్న వారందరినీ నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారి వెల్లడించారని బీబీసీ పేర్కొంది. ‘‘వలసలు బ్రిటన్‌ను వేధిస్తున్నాయి.

2021లో 1,73,000గా ఉన్న వలసలు ఈ ఏడాది 5,04,000కు పెరిగాయి. విదేశీ విద్యార్థుల్లో చైనాను భారతీయులు వెనక్కినెట్టారు. కానీ వీరిని తగ్గిస్తే ఆ సీట్లను బ్రిటన్‌ వర్సిటీలు స్థానిక విద్యార్థులకు తక్కువ ఫీజుకే ఇవ్వాల్సి ఉంటుంది. అవి భారీ ఆదాయాన్ని కోల్పోతాయి. ఆదాయం కాపాడుకుంటూ, అంతర్జాతీయ విద్యార్థుల్ని తగ్గించుకోవడం సంక్షిష్టమైన అంశం’’ అని సునాక్‌ అధికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. భారత విద్యార్థులు వీసా ముగిసినా బ్రిటన్‌లో తిష్ట వేస్తున్నారన్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్‌ వ్యాఖ్యలు దీనికి నేపథ్యంగా భావిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top