రష్యా టూర్‌కు బయలుదేరిన ప్రధాని | PM Modi Went To Russia, Austria Tour | Sakshi
Sakshi News home page

రష్యా టూర్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ

Jul 8 2024 10:40 AM | Updated on Jul 8 2024 10:56 AM

PM Modi Went To Russia, Austria Tour

న్యూఢిల్లీ: మూడో టర్ములో ప్రధాని మోదీ రెండో విదేశీ టూర్‌ మొదలైంది. రష్యా, ఆస్ట్రియా  దేశాల్లో పర్యటన కోసం సోమవారం(జులై 8) ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. మూడు రోజుల పాటు రెండు దేశాల్లో ప్రధాని పర్యటన సాగనుంది. 

 పర్యటనలో భాగంగా భారత్‌, రష్యా 22వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. సదస్సులో  రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాకక్షిక చర్చలు జరపనున్నారు. 

రష్యాలో నివసిస్తున్న భారతీయులను ప్రధాని కలవనున్నారు. అనతరం అక్కడి నుంచి  ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని  ఆస్ట్రియాలో పర్యటించనుండటం  విశేషం. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement