ఫిలిప్పీన్స్‌ తుపాను.. 375కు చేరిన మరణాలు

Philippines Super Typhoon Rai death toll surges - Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం సంభవించిన తీవ్ర తుపాను ‘రాయ్‌’ తీవ్రతకు మరణించిన వారి సంఖ్య భారీస్థాయిలో పెరుగుతోంది. తాజాగా మరణాల సంఖ్య మొత్తంగా 375కు చేరుకుంది. మరోవైపు, ఈ తుపాను ధాటికి 56మంది జాడ తెలియడం లేదని అధికారులు సోమవారం తెలిపారు. గోడలు, చెట్లు కూలిపడటం, ఆకస్మిక వరదలు, కొండచెరియలు విరిగి పడిన ఘటనల్లో మరో 500 మంది గాయపడ్డారన్నారు.

తుపాను తాకిడికి గురైన 25 నగరాలు, పట్టణాల్లో ఇప్పటికీ సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం వీలుకాలేదని చెప్పారు. మరో 200కు పైగా నగరాలు, పట్టణాలు చీకట్లోనే మగ్గుతున్నాయన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆహారం, మంచినీరు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top