ఒరిజనల్‌ డాటర్‌ని నేనే అంటూ యువతి హల్‌చల్‌

Pakistani Woman Claiming to be Donald Trump Real Daughter - Sakshi

ఇస్లామాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన నోటి దురుసుతనమే. తలాతోకా లేని వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్‌ ముందుంటారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. ‘‘నేను ఓడిపోలేదు’’.. ‘‘బైడెన్ గెలుపును గుర్తించను’’.. ‘‘వైట్‌హౌజ్‌ని ఖాళీ చేయను’’ అంటూ పొంతన లేని వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఓ పాకిస్తాన్‌ యువతి వల్ల ట్రంప్‌ పేరు వార్తల్లో నిలిచింది. ఎందుకంటే సదరు పాక్‌ యువతి తాను ట్రంప్‌ నిజమైన కుమార్తెని అంటూ ప్రకటించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక దీనిలో బుర్ఖా ధరించిన ఓ యువతి ట్రంప్‌ ఒరిజనల్‌ కుమార్తెని నేనే అంటూ ప్రకటించడం చూడవచ్చు. (చదవండి: ఈ నెలలో ఇదే పెద్ద జోక్‌!)

ఇక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను జోక్‌ చేయడం లేదు. సీరియస్‌గా మాట్లాడుతున్నాను. డొనాల్డ్‌ ట్రంప్‌ నా నిజమైన తండ్రి. నేను మా నాన్నని కలుసుకోవాలని భావిస్తున్నాను. ఆయన నన్ను, మా అమ్మని పట్టించుకోవడం మానేశారు. దీని గురించి మా అమ్మ, ట్రంప్‌తో గొడవపడేది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. వాస్తవంగా ఈ వీడియో 2018, డిసెంబరులో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరో సారి నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. తాజాగా మరోసారి వైరలవుతోంది. అయితే ప్రతిసారి ఈ వీడియోను లక్షల మంది వీక్షిస్తుండటం గమనార్హం. ఇక డొనాల్డ్‌ ట్రంప్‌కి‌ ఇవాంకా ట్రంప్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, బారన్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, టిఫనీ ట్రంప్ అంటూ ఐదుగురు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top