ఖాట్మండు: నేపాల్ ఆకస్మికంగా వచ్చిన వరదలు తీవ్రస్థాయిలో ప్రాణ, ధన నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ జలప్రళయం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటివరకూ 1,066కు చేరుకుంది. మరో వేల సంఖ్యలో ప్రజల జాడ తెలియలేదు. మృతదేహాలను గుర్తించడం సైతం ఇప్పుడు అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనైనా మృతదేహాల గుర్తింపు సులభతరమయ్యేలా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నేపాల్లో వరదల కారణంగా మృతిచెందిన వారి వందలాది మృతదేహాలు దహనం చేయడానికి బదులుగా ఖననం చేయాలని అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మృతదేహాల అవశేషాలు సురక్షితంగా ఉంటాయని తద్వారా భవిష్యత్తులో DNA ను కుటుంబ సభ్యులకు గుర్తించి అప్పగించవచ్చని భావిస్తున్నారు.
ఇప్పటికే బురద, వరద నీరు తదితర కారణాలతో మృతదేహాల పరిస్థితి క్షీణించింది. అనేక మృతదేహాలు నీటిలో వాపు మరియు వేగంగా కుళ్ళిపోతున్నాయి. దీంతో వారిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. మరోవైపు, మార్చురీ, తాత్కాలిక కేంద్రాలు సైతం మృతదేహాలతో నిండి పోయాయి. ఈ పరిస్థితిలో, పరిపాలన చాలా కాలం పాటు శరీరాలను సురక్షితంగా ఉంచడం సాధ్యం కాదని అందుకే గుర్తు తెలియని మృతదేహాలు సామూహిక సమాధుల్లో ఖననం చేయబడుతున్నట్లు అధికారులు తెలిపారు. .
కాగా ఆగస్టు 26న సంభవించిన వరదల కారణంగా ఇప్పటివరకూ 1066 మంది మృతిచెందారు, వారిలో 1050 మంది నేపాల్, టిబెట్లో 16 మంది మరణించారు. అదే విధంగా దాదాపు 4,400 మందికి పైగా ప్రజలు ఆచూకీ గల్లంతైంది.


