రామ్‌దేవ్‌ బాబాకు భారీ షాక్‌: నేపాల్‌ కూడా

Nepal Stopped Distribution Of Patanjali Coronil Kits - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురువు, పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ బాబాకు భారీ షాక్‌ తగిలింది. కరోనా వైరస్‌ సోకకుండా తీసుకువచ్చిన కరోనిల్‌ మందును భూటాన్‌ నిలిపివేయగా.. తాజాగా నేపాల్‌ ఆ మందును వాడకూడదని ఆదేశించింది. భూటాన్‌ గతంలోనే కరోనిల్‌పై నిషేధం విధించింది. తాజాగా నేపాల్‌ సోమవారం ఆ మందుల పంపిణీని నిలిపివేసింది. రామ్‌దేవ్‌ బాబా బహుమతిగా అందించిన 1,500 కరోనిల్‌ కిట్లను వాడకూడదని నిర్ణయించింది. ఎందుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కోనవడంలో కరోనిల్‌ విఫలం చెందిందని గుర్తించింది. 

ఈ మేరకు ఆ దేశ ఆయుర్వేద మంత్రిత్వ శాఖ కరోనిల్‌ మందును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనిల్‌ కిట్‌లో ఉన్న ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలం పొందినట్లు పేర్కొంది. దీంతో ఆ కిట్‌ను పంపిణీ చేయడం నిలిపివేసింది. కరోనిల్‌కు ప్రత్యామ్నాయ మందులకు నేపాల్‌ ప్రభుత్వం ఆర్డర్లు చేసింది. కరోనిల్‌ కిట్‌ను పతాంజలి సంస్థ రూపొందించింది. ఈ మందును 2020 జూన్‌ 23వ తేదీన విడుదల చేశారు. ఈ మందు కరోనా కట్టడిలో విఫలం చెందిందని పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆ మందుకు డిమాండ్‌ లేకుండాపోయింది. అయితే పతాంజలి సంస్థ మాత్రం తమ కరోనిల్‌ కిట్‌ను లక్షల్లో విక్రయించినట్లు తెలిపింది.

చదవండి: పతంజలి ‘కరోనిల్‌’తో ఉపయోగం నిల్‌
చదవండి: రామ్‌దేవ్‌ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్‌ డే

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top