నేపాల్‌ కార్మిక మంత్రి దీప్‌కుమార్‌ షా తొలగింపు | Nepal Pm Balen Shah removes Labour Minister Deepak Kumar Sah | Sakshi
Sakshi News home page

నేపాల్‌ కార్మిక మంత్రి దీప్‌కుమార్‌ షా తొలగింపు

Apr 10 2026 6:09 AM | Updated on Apr 10 2026 6:09 AM

Nepal Pm Balen Shah removes Labour Minister Deepak Kumar Sah

భార్య కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు  

కఠ్మాండు: నేపాల్‌ కొత్త ప్రభుత్వంలో ఒక కుదుపు. నూతన మంత్రివర్గం కొలువుదీరిన 15 రోజుల్లో ఒక మంత్రికి ఉద్వాసన పలికారు. భార్యకు లబ్ధి చేకూర్చడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రధానమంత్రి బాలెంద్ర షా కార్మిక, ఉద్యోగ, సామాజిక భద్రత శాఖ మంత్రి దీప్‌కుమార్‌ షాను కేబినెట్‌ నుంచి తొలగించారు. 

అధికార రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్‌ఎస్పీ) సిఫార్సు మేరకు ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. దీప్‌కుమార్‌ షా భార్య హెల్త్‌ ఇన్సూరెన్స్‌ బోర్డు సభ్యురాలిగా పనిచేసేవారు. ఆమె పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆమెను మళ్లీ అదే పదవిలో నియమించడంతో వివాదం మొదలైంది.  

Advertisement
 
Advertisement
Advertisement