USA: Man Wins 7 Crore Lucky Lottery After heart surgery - Sakshi
Sakshi News home page

అదృష్టం అంటే ఇదే.. కోట్లలో లాటరీ!

Dec 2 2021 7:37 PM | Updated on Dec 3 2021 12:44 PM

Man Wins 7 Crore Lucky Lottery After heart surgery Get well Card In USA - Sakshi

లాటరీ తగిలితే.. ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా తోడవుతుంది. ఆరోగ్యం బాగాలేక చికిత్స తీసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లాటరీ గెలిస్తే.. సంతోషానికి హద్దు ఉండదు. అచ్చం ఇటువంటి ఓ​ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది.

మసాచుసెట్స్‌లోని అలెగ్జాండర్ మెక్లీష్ ఓపెన్‌ హార్ట్ సర్జరీ చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు తన స్నేహితుడి దగ్గర నుంచి వచ్చిన గెట్‌వెల్‌ కార్డులో వన్‌ మిలియన్‌(రూ.7.5 కోట్లు) డాలర్ల లాటరీ తగిలింది. మసాచుసెట్స్‌ రాష్ట్ర లాటరీ కమిషన్‌ తెలిపిన వివారాల ప్రకారం.. మెక్లీష్‌కి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించుకుంటున్న సమయంలో అతని స్నేహితుడు మూడు లాటరీ స్క్రాచ్ ఆఫ్ టిక్కెట్‌లను తిసుకున్నాడు.

అయితే సర్జరీ అనంతరం మెక్లీష్  వాటిని స్క్రాచ్‌ చేయగా.. వన్ మిలియన్‌  భారీ లాటరీ గెలుచుకున్నాడు. అన్ని టాక్స్‌లు పోను మెక్లీష్‌ సుమారు 4.8 కోట్లను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం 20 డాలర్లు (రూ.1500) పెట్టి కొన్న లాటరికీ  6,50,000 డాలర్లు (రూ. 4.8 కోట్లు) పొందటంపై మెక్లీష్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement