
వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో(Colorado)లో కలకలం చెలరేగింది. ఇక్కడి బౌల్డర్‌లో చోటుచేసుకున్న దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
ఎప్‌బీఐ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బెన్ విలియమ్సన్ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ నిందితుడు యూదులపై బాంబులు విసురుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అని అరిచాడని తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వీజర్ మాట్లాడుతూ ఈ ఘటనలో కొందరిని లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తున్నదన్నారు. కాగా నిందితుడిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాగా ఎప్‌బీఐ గుర్తించింది.
ఈ ఘటనపై బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫెర్న్ మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ బందీలను గుర్తుచేసుకుంటూ ప్రదర్శన జరుగుతుండగా, దానికి సమీపంలోనే ఈ దాడి జరిగిందన్నారు. గాజా- ఇజ్రాయెల్ యుద్ధం నేపధ్యంలో అమెరికాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఇజ్రాయెల్(Israel) మద్దతుదారులు.. ఈ పాలస్తీనా అనుకూల నిరసనలను యూదు వ్యతిరేక నిరసనలుగా పేర్కొంటున్నారు.
🚨Disturbing scenes of panic and chaos! Stay away & Safe.
⚠️Developing: Police are asking the public to avoid Pearl and 13th in Boulder after a reported attack as it's show here!
pic.twitter.com/8ZBYzYKdgZ— Mohanad Shaabani (@MohanadShaabani) June 1, 2025
బౌల్డర్‌లో జరిగిన ఘటనను చూసిన కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన 19 ఏళ్ల బ్రూక్ కాఫ్‌మన్ మాట్లాడుతూ, దాడి జరిగిన సమయంలో నలుగురు మహిళలు కాలిన గాయాలతో బాధపడుతుండటాన్ని చూశానని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ప్రాంగణంలో చొక్కా లేకుండా నిలుచుని, ఏదో ద్రవం ఉన్న గాజు సీసాలను పట్టుకుని అరిచాడని ఆమె వివరించారు. కాగా ప్రముఖ యూదు డెమొక్రాట్, సెనేట్ మైనారిటీ నేత చక్ షుమెర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పోటీ