Animal Virus: పంది గుండె మార్పిడి చేయించుకున్న రోగి చనిపోవడానికి కారణం అదే...

A Man Heart Transplant From Pig Died Detected In Animal Virus - Sakshi

Animal virus detected in patient: ఇటీవలే పందిగుండె అమర్చిన వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతను ఎందువల్ల చనిపోయాడు కారణాలేంటి అనే దానిపై వైద్యులు పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ వైద్యులు 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పంది గుండెని అమర్చి ప్రపంచ చరిత్రోలోనే ఒక సంచలనాత్మక ప్రయోగానికి నాంది పలికారు. ఆ సర్జరీ కూడా విజయవంతమైంది. ఇది వైద్యశాస్రంలోనే ఒక సరికొత్త అధ్యయనం అని అందరూ ఆనందించేలోపే ఆ వ్యక్తి సర్జరీ జరిగిన రెండు నెలల్లోనే చనిపోయాడు.

వైద్యులు కూడా అతన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించారు కూడా. అసలు ఎందుకు ఇలా జరిగిందని పరిశోధనలు చేస్తున్న వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈమేరకు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు మాట్లాడుతూ... పంది గుండె లోపన వైరల్‌ డీఎన్‌ఏ ఉంది. పోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలువబడే ఈ బగ్ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తించలేకపోయాం. జంతువుల నుంచి మనుషులను అవయవాలను అమర్చినప్పుడూ కొత్త ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవలసి ఉంటుంది.

కొన్ని వైరస్‌లు చాలా గుప్తంగా ఉంటాయి. సర్జరీకి ముందు బెన్నెట్‌ మానవ గుండె మార్పిడికీ అనర్హుడని, పైగా అతనికి వ్యాధి నిరోధక శక్తి తక్కువని తెలిసే జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చాం. పైగా ఆ వైరస్‌ భారిన పడకుండా ఉండేలా అతని అత్యంత మెరుగైన చికిత్స కూడా అందించాం. మా బృందం దాత పంది ఆరోగ్యంగా ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించింది. అంతేకాదు ఆ పంది అంటువ్యాధులు వ్యాప్తి చేయకుండా నిరోధించేలా పెంచే ప్రత్యేక సదుపాయంలో ఉంది.

బెన్నెట్‌కి యాంటీ వైరల్‌ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలను అందించాం. అని అన్నారు. బెన్నెట్‌ సర్జరీ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలు పెట్టాడని, ముందు జాగ్రత్త చర్యగా వైరల్‌ ఇన్ఫెక్టకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని సర్జరీ చేసిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. ఐతే పంది గుండే ఉబ్బిపోయి ద్రవంతో నిడిపోయి పనిచేయడం మానేసిందన్నారు. కానీ ఈ పంది వైరస్‌ ఎలా మానవ శరీరంపై ప్రభావితం చేస్తుందో స్పష్టం చేయలేదు.

(చదవండి: పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top