
ఆన్‌లైన్ పోర్టలోలో ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న మాజీ భార్యను హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేశారు.
బీజింగ్: ఆన్‌లైన్ పోర్టలోలో ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న మాజీ భార్యను హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేశారు. చైనాలో ఈ ఘటన జరిగింది. సిచువాన్ ప్రావిన్స్‌లో నివసించే టాంగ్ లూ తన భార్య లామూను వేధించేవాడు. దీంతో 2020లో విడాకులు తీసుకుంది. మళ్లీ పెళ్లాడాలని వేధించాడు. 2020 సెప్టెంబర్‌లో ఆమె ఇంటికొచ్చాడు. అప్పటికే ఆమె టిక్‌టాక్ లాంటి ఆన్‌లైన్ పోర్టల్ డౌయిన్‌లో లైవ్ కార్యక్రమాలు చూస్తోంది. తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించి, ఆమెపై పెట్రోల్ పోసి, నిప్పటించాడు.
తీవ్రంగా గాయపడిన లామూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని వారాల తర్వాత మరణించింది. ఈ సంఘటన చైనాలో తీవ్ర సంచలనం సృష్టించింది. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం 2021 అక్టోబర్‌లో అతడికి మరణ శిక్ష విధించింది. ఇటీవలే అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు.
ఇదీ చదవండి: మృత్యువులోనూ వీడని స్నేహం