గాల్లో నేవీ హెలికాఫ్టర్లు ఢీ.. 10 మంది దుర్మరణం | Malaysian Navy helicopters collide in mid-air: Updates | Sakshi
Sakshi News home page

విషాదం: గాల్లో ఢీ కొట్టిన నేవీ హెలికాఫ్టర్లు.. 10 మంది దుర్మరణం

Apr 23 2024 10:43 AM | Updated on Apr 23 2024 11:04 AM

Malaysian Navy helicopters collide mid air Mishap Updates - Sakshi

మలేషియాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లు గాల్లోనే ఒకదాంతో మరొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు.

రాయల్‌ మలేషియన్‌ నేవీ పరేడ్‌ కోసం మంగళవారం ఉదయం లుముత్‌ నేవల్‌ బేస్‌లో రిహాల్సల్‌ జరిగాయి. ఆ సమయంలో రెండు హెలికాఫ్టర్లు ఆకాశంలోనే ఢీ కొట్టాయి. ముక్కలైన శకలాలు కింద మైదానంలో పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. రెండు హెలికాఫ్టర్లలో పది మంది సిబ్బంది అక్కడికక్కడే చనిపోయినట్లు మలేషియా నేవీ ప్రకటించుకుంది. మృతదేహాల గుర్తింపునకు కోసం నేవీ ఆస్పత్రికి మృతదేహాల్ని తరలించినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement