కాప్‌ 26 సదస్సులో జోబైడెన్‌ కునికిపాట్లు

Joe Biden Fall A Sleep While Listening To COP Speech - Sakshi

గ్లాస్గో:స్కాట్లాండ్‌లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్‌ ఈవెంట్‌ క్యాంపస్‌లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌–కాప్‌) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు జరిగిన కాప్‌26 వాతావరణ మార్పుల సదస్సు లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కళ్లు మూసుకుని కూర్చున్నట్లు చూపించే వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

(చదవండి: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం)

వాతావరణ సదస్సు కోసం గ్లాస్గోకు వెళ్లిన ప్రపంచ నాయకులలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు.అతను మొదట్లో స్పీకర్‌ చెబుతున్న ప్రసంగం వింటున్నట్లు కనిపించాడు. అయితే కొన్ని సెకన్ల తర్వాత ప్రసంగ కొనసాగుతుండగా మరోవైపు యూఎస్‌ అధ్యక్షుడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు ఉంటాడు. ఆ తర్వాత ఒక సహాయకుడు బైడెన్‌ దగ్గరకి వస్తున్న వెంటనే అతను కళ్ళు తెరిచి ప్రసంగాన్ని వింటూన్నట్లుగా చప్పట్లు కొడుతూనే ఉంటాడు.  

అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో తోపాటు " కాప్‌ 26 ప్రారంభ ప్రసంగాల సమయంలో బిడెన్ నిద్రపోతున్నట్లు కనిపిస్తోంది" అనే క్యాప్షన్‌ జోడించి  వాషింగ్టన్ రిపోర్టర్ జాక్ పర్సర్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.  దీంతో ఈ వీడియోకు మిలియన్స్‌లో వ్యూస్‌ వచ్చాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top