
లండన్: యూకే రాజధాని లండన్‌కు 58 కిలోమీటర్ల దూరంలో సౌతెండ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం సాయంత్రం ఒక విమానం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో తొమ్మిది మంది ప్రయాణి కులు, ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రాణ నష్టం వాటిల్లిందా? అనే వివరాలు తెలియరాలేదు.
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తొలుత భారీ అగి్నగోళం, తర్వాత దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చాలా తీవ్రమైన ప్రమాదం అని పోలీసులు చెప్పారు. కూలిపోయింది చిన్నపాటి విమానమేనని తెలిసింది. సౌతెండ్ నుంచి నెదర్లాండ్స్‌లోని లెలీస్టడ్ సిటీకి బయలుదేరుతుండగా ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు సమాచారం.
