మస్క్‌కు షాక్‌: దూసుకొచ్చిన బెజోస్‌

Jeff Bezos worlds richest person again - Sakshi

ముగిసిన మస్క్ మూణ్ణాళ్ల ముచ్చట

టాప్‌ బిలియనీర్‌గా జెఫ్ బెజోస్‌

రెండవ స్థానంలో ఎలాన్‌ మస్క్‌

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం బెజోస్ అపర కుబేరుడి టైటిల్‌ను దక్కించుకున్నారు. జెఫ్ ఆస్తుల విలువ 191.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా ఇటీవలి కాలంలో టాప్‌ బిలియనీర్‌గా అవతరించిన  టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను వెనక్కు నెట్టారు బెజెస్‌.  దాదాపు నాలుగేళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన  బెజోస్ ఇటీవల  నెంబర్‌ 2 స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్  దాదాపు ఆరు వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ బిలియనీర్‌ స్థానంలో కొనసాగారు. (ఎలాన్‌ నెంబర్‌ 1 ఎలా అయ్యాడు?)

టెస్లా షేర్ల విలువ విలువ పడిపోవడంతో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ 4.6 బిలియన్ డాలర్ల మేరకు తగ్గింది. మంగళవారం టెస్లా షేర్లు 2.4 శాతం  కుప్పకూలింది. జనవరి 26న ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్న టెస్లా షేర్ల విలువ, ఆపై దాదాపు 10 శాతం వరకూ పతనమైంది. ఈ కారణంతోనే ఎలాన్ మస్క్, కుబేరుల జాబితాలో మరోసారి రెండో స్థానానికి పరిమిత మైనారని బ్లూమ్‌ బర్గ్‌ తెలిపింది. ఎలాన్ మస్క్ కన్నా 955 మిలియన్ డాలర్ల ఎక్కువ ఆస్తి బెజోస్‌ సొంతమని పేర్కొంది. మరోవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బిట్ కాయిన్‌తో పాటు, మరో క్రిప్టో కరెన్సీ డోజ్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. 1.5 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించిన తరువాత, బిట్‌కాయిన్ విలువ 50 వేల డాలర్ల రికార్డు స్థాయిని దాటేసింది. (మెగా బూస్ట్‌:  చెన్నైలో అమెజాన్‌ )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top