కూలిన జపాన్‌ ఆర్మీ హెలికాప్టర్‌..10 మంది గల్లంతు | Japanese army helicopter with 10 crew members goes missing | Sakshi
Sakshi News home page

కూలిన జపాన్‌ ఆర్మీ హెలికాప్టర్‌..10 మంది గల్లంతు

Apr 8 2023 5:12 AM | Updated on Apr 8 2023 7:01 AM

Japanese army helicopter with 10 crew members goes missing - Sakshi

టోక్యో: జపాన్‌ దక్షిణ దీవుల్లో కుమమోటో నుంచి నిఘా విధుల్లో భాగంగా గురువారం బయలుదేరిన బ్లాక్‌హాక్‌ రకం హెలికాప్టర్‌ 10 నిమిషాల అనంతరం రాడార్‌ నుంచి అదృశ్యమైంది. అది మియాకో, ఇరాబు మధ్య సముద్రజలాల్లో కూలి ఉంటుందని భావిస్తున్నారు. ఆ హెలికాప్టర్‌కు చెందిన లైఫ్‌బోట్‌ను, ఒక తలుపు, తదితర భాగాలను శుక్రవారం సహాయక సిబ్బంది కనుగొన్నారు. హెలికాప్టర్‌లోని డివిజన్‌ కమాండర్‌ సహా 10 మంది సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది.

వీరిలో ఎవరూ ప్రాణాలతో ఉండేందుకు అవకాశం లేదంటూ జపాన్‌ రక్షణ మంత్రి యసుకాజు హమదా శుక్రవారం మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. వారికోసం గాలింపు కొనసాగిస్తామన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. చైనా నుంచి ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్‌ ప్రభుత్వం ఇటీవలి కాలంలో రక్షణ సన్నద్ధత కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడం  గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement