ట్రంప్‌నకు షాక్‌ల మీద షాక్‌..! | Iran rejects US terms as excessive | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు షాక్‌ల మీద షాక్‌..!

Mar 30 2026 6:05 PM | Updated on Mar 30 2026 6:13 PM

Iran rejects US terms as excessive

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా ఇరాన్‌ ఎంతకీ తగ్గకపోవడంతో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరింత దూకుడుగా వెళ్దామా అంటే ఇరాన్‌ నుంచి ఏ ముప్పు వస్తుందోననే భయం ట్రంప్‌లో నెలకొంది. అలాగని కొన్ని రోజుల పాటు వార్‌కు గ్యాప్‌ ఇచ్చారు ట్రంప్‌. అదే సమయంలో ఇరాన్‌కు వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తూనే మధ్యవర్తిత్వాన్ని జరుపుతున్నారు. ఇందుకు ట్రంప్‌.. పాకిస్తాన్‌ను మధ్యలో పెట్టుకున్నారు. కానీ ఇరాన్‌ మాత్రం వీటికి ససేమేరా అంటోంది. యుద్ధానికి ఘనమైన ముగింపు ఏంటో తామే ఇస్తామని,  ఇటువంటి అర్థం పర్థం లేని మధ్యవర్తిత్వాలు వద్దనే అంటోంది. 

మధ్యవర్తిగా తమ పాత్ర పట్ల అమెరికా, ఇరాన్‌లు రెండూ సంతృప్తిగా ఉన్నాయని పాకిస్తాన్ చెప్పిన రోజుల వ్యవధిలోనే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ వాదనలను తోసిపుచ్చింది. మధ్యవర్తి ద్వారా తమకు అసమంజసమైన డిమాండ్లు మాత్రమే అందాయని పేర్కొంది. అమెరికా తమతో నేరుగా చర్చలు జరపలేదని, మధ్యవర్తిత్వాల ద్వారా యుద్ధం ముగింపు అనేది ఉండబోదని తేల్చిచెప్పింది. ఒకవేళ అమెరికా తమతో తాము పెట్టే కండీషన్స్‌కు డైరెక్ట్‌గా మాట్లాడి ఒప్పుకుంటేనే అప్పుడు యుద్ధం ముగింపు ఆలోచిస్తామని స్పష్టం చేసింది. తమకు పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం అనేది వద్దే వద్దని, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అంటోంది, 

పాక్‌.. అమెరికా వదిలిన అస్త్రం!
పాక్‌ అనేది అమెరికా వదిలిన అస్త్రమనే విషయమని ఇరాన్‌కు అర్థమైంది. ఇన్ని ప్రపంచదేశాలు ఉండగా పాకిస్తాన్‌నే మధ్యవర్తిగా అమెరికా పెట్టుకోవడంపై ఇరాన్‌ ఆగ్రహంగా ఉంది. తమకు ఏదో రకంగా నష్టం కల్గించాలనే యోచనతోనే పాకిస్తాన్‌ను అమెరికా వాడుకుంటుందని, ఆ పావులో తాము పడకూడదనే భావన ఇరాన్‌లో స్పష్టంగా కనబడుతోంది. మాట్లాడితే మీరు డైరెక్ట్‌గా మాట్లాడండి.. ఇలా మధ్యవర్తిత్వం, అందులోనూ పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం అంటే సహించలేకపోతోంది ఇరాన్‌. యుద్ధం ముగింపు విషయం తమ వైఖరి స్పష్టంగా ఉందని, దౌత్యం విషయంలో అమెరికా తరచు మాటమారుస్తుందని ఇరాన్‌ అంటోంది. ఒకవేళ తమ మధ్యవర్తిత్వం అనేది చేస్తే అమెరికా తలతూగే ఏ పెద్ద దేశమో చేయాలి కానీ ఇలా పాకిస్తాన్‌ను మధ్యలో తీసుకురావడం ఏంటనేది ఇరాన్‌ ప్రశ్నగా ఉంది. అందుకే యుద్ధం విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. 

డైలమాలో ట్రంప్‌..
ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక..  పాకిస్తాన్‌తో రాయబారం నడుపుతుంది. ఇరాన్‌తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్‌.. అందుకు పాక్‌ను ఎన్నుకున్నారు. ఇరాన్‌ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్‌.. ఇక పాక్‌ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్‌లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్‌ ఇచ్చారు.

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్‌లో ట్రంప్‌ పడ్డారని, అందుకే ఇరాన్‌పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్‌పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్‌ వెనుకడుగు వేశారు. మరొకవైపు అమెరికాలో తీవ్రస్థాయిలో నిరసనలు కూడా ట్రంప్‌ను డైలమాలోకి నెట్టేశాయి. 

ప్రస్తుతం ఇరాన్‌ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్‌ మాట.. ఇరాన్‌ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్‌ నిపుణుల అభిప్రాయం.   ఒకవేళ ఇరాన్‌ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్‌కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. అంటే నేరుగా అమెరికానే ఇరాన్‌తో చర్చలు జరిపితేనే ఇది  ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. 

ట్రంప్‌కు స్పెయిన్‌ షాక్‌..
ట్రంప్‌నకు మరోషాక్‌ తగిలింది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్‌ అనమతి నిరాకరించింది. ఇరాన్‌పై యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తన వైఖరిని కఠినతరం చేస్తూ, అమెరికా యుద్ధ విమానాలకు తన గగనతలంతో పాటు సైనిక స్థావరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఇరాన్‌తో యుద్ధంలో పాల్గొనే అమెరికా యుద్ధ విమానాలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement