రికార్డు సృష్టించిన ఇరాన్‌.. 37 రోజులుగా ఆ సేవలు బంద్‌ | Iran records record internet outages | Sakshi
Sakshi News home page

రికార్డు సృష్టించిన ఇరాన్‌.. 37 రోజులుగా ఆ సేవలు బంద్‌

Apr 5 2026 10:58 PM | Updated on Apr 6 2026 4:59 AM

 Iran records record internet outages

ఇరాన్‌ ప్రస్తుతం యుద్ధంతో అట్టుడుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో విరుచుకపడడంతో ఆ దేశంలోని మౌళిక సదుపాయాలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం ఇంటర్నెట్‌ నిలిపివేసిన దేశంగా రికార్డు సాధించింది.

ఇరాన్ దేశవ్యాప్తంగా విధిస్తున్న ఇంటర్నెట్ షట్‌డౌన్ ఇప్పుడు 37వ రోజుకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత సుదీర్ఘమైన జాతీయ స్థాయి ఇంటర్నెట్ బ్లాకౌట్‌గా  నివేదికలు పేర్కొన్నాయి. యుద్ధం ప్రారంభమైన రోజు ఫిబ్రవరి 28నుండి  ప్రారంభమైన ఇంటర్నెట్ షట్‌డౌన్‌ ఇప్పటికి 864 గంటలకు పైగా కొనసాగుతోంది.

అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమందికి  మాత్రమే 'వైట్‌లిస్ట్' విధానం ద్వారా యాక్సెస్ ఇస్తున్నట్లు సమాచారం

అయితే దీనివల్ల యుద్ధ సమయంలో ప్రజలు తమ ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకోలేకపోతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా కొన్ని సంస్థలు చెబుతున్నప్పటికీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాాగా ఇప్పటి వరకూ మయన్మార్, సుడాన్, ఉక్రెయిన్‌, గాజా వంటి దేశాల్లో ఇంటర్నెట్ సేవలు తగ్గించారు గాని ఇంత పెద్ద మెుత్తంలో ప్రభుత్వమే  దానిపై బ్యాన్ విధించలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement