భారత సంతతి రాజా చారికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి!

Indian American Astronaut Raja Chari Nominated For Key Role - Sakshi

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారి అరుదైన ఘనత సాధించనున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ ఈయనను ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి నామినేట్ చేశారు.  సెనేట్ దీన్ని ఆమోదిస్తే అగ్రరాజ్యం వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు. అమెరికా వైమానిక దళంలో సైన్యంలాగే బ్రిగేడియర్‌లను వన్-స్టార్ జనరల్స్‌గా పరిగణిస్తారు ర్యాంకులుంటాయి.

చంద్రునిపైకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్న అమెరికా మిషన్‌ అర్టెమిస్ బృందలో చారి సభ్యుడు. ఈయన సారథ్యంలోనే 2021లో నాసా సిబ్భంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. అక్కడ 177 రోజులు ఉన్న చారి.. స్పేస్ వాక్ కూడా నిర్వహించారు.

రాజా చారి నాసాలో చేరకముందు అమెరికా ఎయిర్‌ఫోర్సులో టెస్ట్ పైలట్‌గా ఉన్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
చదవండి: మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్‌

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top