రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం: యుద్ధంపై భారత్‌ రియాక్షన్‌ ఇది

India Stand On Ukraine Russia Crisis Neutral - Sakshi

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటరీ ఆపరేషన్‌ అని పుతిన్‌ ప్రకటించినప్పటికీ.. అది యుద్ధంగానే ప్రపంచం భావిస్తోంది. ఇరు దేశాల పోటాపోటీ ప్రకటనలతో గందరగోళం నెలకొంది. ఆస్తి, ప్రాణ నష్టం ఇప్పుడప్పుడే ఒక అంచనాకి వచ్చే పరిస్థితులు ఎలాగూ లేవు. కనీసం వీలైనంత త్వరగా నష్టనివారణ చర్యలు చేపట్టాలని పాశ్చాత్య దేశాలపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. యుద్ధంపై భారత్‌ తన స్పందన వెల్లడించింది. 

రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో భారత్‌ తటస్థ పాత్ర పోషిస్తుందని భారత్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ(స్టేట్‌) మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ మీడియాతో గురువారం మాట్లాడారు. Ukraine-Russian Crisis పై స్పందించిన రాజన్‌ సింగ్‌.. మా(భారత్‌) స్టాండ్‌ తటస్థం. శాంతియుత పరిష్కారాన్ని మేం ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారాయన. త్వరలోనే పరిస్థితి సర్దుమణుగుతుందని అనుకుంటున్నాం. అవసరమైతేనే భారత్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలనుకుంటోంది. అప్పటిదాకా తటస్థంగానే ఉంటాం. ఒకవేళ కోరితే.. చర్చలకు వీలైన రీతిలో సాయం అందిస్తామ’ని చెప్పారాయన.

సంబంధిత వార్త: ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రత్యేక విమానం! భారతీయులు ఏమన్నారంటే..

ఇదిలా ఉంటే స్పెషల్‌ ఫ్లైట్‌ ద్వారా భారతీయులను(విద్యార్థులతో సహా) కొందరు ఇవాళ ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం నుంచి ఉక్రెయిన్‌ను తూర్పు, ఉత్తరం, దక్షిణ వైపు నుంచి రష్యా బలగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో భయాందోళనల నడుమ ప్రజలు పశ్చిమానికి తరలిపోతున్నారు. మరోవైపు భారతీయులను సైతం పడమర వైపునే తరలించే ప్రయత్నాలు సాగుతున్నాయి. భారత్‌-ఉక్రెయిన్‌ నడుమ ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో ఎయిర్‌ ఇండియా మూడు ఫ్లైట్లను నడిపించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్త: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 18 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top