ట్రంప్‌ పేరుతో విమానాశ్రయం.. కరెన్సీ పై కూడా..? | Florida airport named after Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ పేరుతో విమానాశ్రయం.. కరెన్సీ పై కూడా..?

Apr 1 2026 1:00 AM | Updated on Apr 1 2026 3:17 AM

Florida airport named after Trump

అమెరికా ఫ్లోరిడాలోని విమానాశ్రయానికి దేశాధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫ్లోరిడా  గవర్నర్ ఆ బిల్లుపై సంతకం చేశారు. అన్ని సవ్యంగా సాగితే అధ్యక్షుడి హోదాలో ఉండగానే ఎయిర్‌ఫోర్టుకు తన పేరు పెట్టుకున్న వ్యక్తిగా ట్రంప్ రికార్డు సృష్టించనున్నారు.

డొనాల్డ్ ట్రంప్‌కు పబ్లిసిటీ పిచ్చిన పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే అక్కడి కొన్ని ప్రభుత్వ సర్వీసులను  తన పేరుమీదుగా అందిస్తోన్న ట్రంప్ ఇప్పుడు తాజాగా విమానాశ్రయానికి తన పేరు పెట్టుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లోరిడాలోని పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును డోనాల్డ్ ట్రంప్‌గా మార్చుతూ గవర్నర్ రాన్ డెసాంటిస్ ఒక బిల్లుపై సంతకం చేశారు.

ఇప్పుడు ఆ ఫైల్‌ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపబడుతుంది. దీని తరువాత, ఫ్లైట్ చార్ట్, నావిగేషన్ సిస్టమ్ మరియు విమానాశ్రయ సంకేతాలు మార్చబడతాయి. ఈ ఫైలును FAA ఆమోదిస్తే  జూలై 1 నుండి ఈ పేరు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే, ట్రంప్ తన పదవీకాలంలోనే అతని పేరు మీద ఎయిర్‌ఫోర్టు ఉంటుంది. ఇలా పదవికాలంలో విమానాశ్రయం పేరు మీదున్న మొదటి అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టిస్తారు.

అయితే ట్రంప్ పేరు మీదకు రాబోతున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయనకు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే అతని ప్రధాన నివాసం. ఇదివరకే అనేక ప్రభుత్వ సేవలు ట్రంప్ పేరు మీద ఉన్నాయి.  అంతే కాకుండా త్వరలో ట్రంప్ సంతకం అక్కడి కరెన్సీపై కూడా ముద్రించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement