అఫ్గానిస్తాన్‌లో భూకంపం | Earthquake in Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్‌లో భూకంపం

Mar 22 2026 7:50 AM | Updated on Mar 22 2026 12:58 PM

Earthquake in Afghanistan

అఫ్గానిస్థాన్‌ని స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు కుదిపేశాయి. ఉత్తర ప్రాంతంతో పాటు  రాజధాని కాబూల్, ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. ఈ భూకంపాల తీవ్రత  రిక్టర్ స్కేలుపై 4.5, 4.6గా రికార్డయింది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఏమైనా  ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే భూకంప తీవ్రతకు  కొన్ని చోట్ల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురై రోడ్లమీదకి వచ్చారు.  కాబుల్ సమీపంలోని డే సబ్జా, ఖాదిర్ ఖిల్, భక్తియారన్ వంటి ప్రాంతాలపై దీని ప్రభావం పడింది.కాగా ఆఫ్ఘనిస్తాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 4 లేదా అంతకంటే తీవ్రతతో వరుసగా భూమి ప్రకపించడం ఈ మధ్య కాలంలో చాలా సార్లు జరిగింది.

కాగా ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం నడుస్తుంది. కాబూల్‌పై పాక్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతుంది. కొద్దిరోజుల క్రితం ఆదేశంలోని ఒక ఆసుపత్రిపై పాక్ మిసైళ్లతో దాడి చేసింది. ఈ దుర్ఘటనలో వందల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement