జీన్‌ కరోల్‌ పరువు నష్టం కేసు.. ట్రంప్‌కు ఎదురు దెబ్బ | Donald Trump To Pay Penalty In Defamation Case Filed By E Jean Carroll, More Details Inside | Sakshi
Sakshi News home page

జీన్‌ కరోల్‌ పరువు నష్టం కేసు.. ట్రంప్‌కు ఎదురు దెబ్బ

Sep 9 2025 7:15 AM | Updated on Sep 9 2025 10:53 AM

Donald Trump To Pay Penalty In Defamation Case Filed By E Jean Carroll

కాలమిస్ట్‌ ఈ. జీన్‌ కరోల్‌ వేసిన పరువు నష్టం కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ 8.33 కోట్ల డాలర్లు(సుమారు రూ.733 కోట్లు) చెల్లించాలంటూ సివిల్‌ జ్యూరీ ఇచ్చిన తీర్పును న్యూయార్క్‌లోని ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సమర్థించింది. ట్రంప్‌ చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చింది. జ్యూరీ పేర్కొన్న పరిహారం సహేతుకంగానే ఉందని సోమవారం రూలింగ్‌ వెలువరించింది.

అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపిందని, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ట్రంప్‌ చేసిన వాదనను తిరస్కరించింది. 1996లో మన్‌హట్టన్‌ డిపార్టుమెంట్‌ స్టోర్‌లో జీన్‌ కరోల్‌పై ట్రంప్‌ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై కోర్టు ఆయనకు 5 మిలియన్‌ డాలర్ల(రూ.400 కోట్ల) జరిమానా విధించింది. గత డిసెంబర్‌లో అప్పీల్స్‌ కోర్టు ఈ తీర్పును సమర్థించింది కూడా.

అయితే, సోషల్‌ మీడియా వేదికగా ట్రంప్‌ పదేపదే జీన్‌ కరోల్‌ లక్ష్యంగా ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై ఆమె పరువు నష్టం కేసు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం రూ.733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement