ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్‌ పార్కింగ్‌, ఎక్కడో తెలుసా 

Do You Know Where Is Worlds Largest Bicycle Parking, Here It Is - Sakshi

మన దేశంలో సైకిల్‌ వినియోగం చాలా తగ్గిపోయింది కానీ, నెదర్లాండ్స్‌లో మాత్రం ప్రజలు సైకిల్‌పై సవారీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆఫీసులకు వెళ్లడానికి దగ్గర నుంచి షాపింగ్‌ మాల్స్‌లో వస్తువుల కొనుగోలు వరకూ సైకిల్‌నే వినియోగిస్తారు. పర్యావరణంపై వాళ్లకు ఉన్న ప్రేమ అలాంటిది. మోటార్‌ సైకిళ్లు వినియోగిస్తే కాలుష్యం ఎక్కువ అవుతుందనే స్పృహతోనే డచ్‌ ప్రజలు సైక్లింగ్‌కు మొగ్గుచూపుతారు. మన దేశంలో మోటార్‌ సైకిల్‌ పార్కింగ్‌లు కనబడ్డట్లే నెదర్లాండ్స్‌లో చాలా చోట్ల సైకిల్‌ పార్కింగ్‌లు ఉంటాయి.

అలాంటి వాటిల్లో ఉట్రెచ్‌ నగరంలోని స్టేషన్‌స్ప్లీన్‌లో ఉన్న సైకిల్‌ పార్కింగ్‌ ప్రపంచంలోనే అతి పెద్దది. 2019 ఆగస్టు 19న దీనిని ప్రారంభించారు. దీనిని ఉట్రెట్‌ మునిసిపాలిటీ, ప్రోరైల్, ఎన్‌ఎస్‌ (డచ్‌ రైల్‌) సంయుక్తంగా నిర్వహిస్తాయి. రైల్‌ ప్రయాణం చేసేవారు తమ సైకిల్‌ను సురక్షితంగా పార్క్‌ చేసుకోవడానికి ఈ భారీ పార్కింగ్‌ బిల్డింగ్‌ను నిర్మించారు. 

ఆ పార్కింగ్‌ ప్లేస్‌ విశేషాలు.. 
► ఇక్కడ 12,500 సైకిళ్లను పార్క్‌ చేయవచ్చు.  
► దానిలో కొంత జాగా రెంట్‌ సైకిల్స్‌కు కూడా ఉంటుంది. 
► ఉట్రెచ్‌ రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉంటుంది. 24 గంటలూ తెరిచే ఉంటుంది. 
► పెద్ద బిల్డింగ్‌లో ఉంటుంది కాబట్టి సైకిళ్లకు ఎండ, వానల నుంచి రక్షణ ఉంటుంది. 
► 24 గంటల వరకూ ఫ్రీ పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. 
► పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చిప్‌కార్డు సహాయంతో పార్కింగ్‌ చేసుకోవచ్చు. 
► ఇక్కడి కారిడార్లను సైకిల్‌ తొక్కడానికి అనువుగా రూపొందించారు. 
► రెండు ఎంట్రన్స్‌లు ఉండే బిల్డింగ్‌లో వన్‌వే అమల్లో ఉంటుంది.  
► మూడు అంతస్తులో ఉండే బిల్డింగ్‌లో ప్రతి చోట బాయ్‌లతో పర్యవేక్షణ ఉంటుంది.  
► విభిన్నంగా ఉండే సైకిళ్లు.. అంటే పెద్ద హ్యాండిల్‌ బార్, డెలివరీ బ్యాగ్‌లను తీసుకెళ్లే సైకిళ్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలం ఉంటుంది.  
► ఇక్కడ సైకిల్‌ రిపేరింగ్‌తో పాటు కావాల్సిన సామానులు కూడా అందుబాటులో ఉంటాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top