డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్‌ 90% రక్షణ

Covishield, Pfizer may be 90 percent effective against death by Delta variant - Sakshi

లండన్‌: కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌పై రెండు డోసుల కోవిషీల్డ్, ఫైజర్‌ టీకాలు 90% సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఈవ్‌–2 అనే సంస్థ స్కాట్లాండ్‌ వ్యాప్తంగా అందిన డేటా ఆధారంగా చేపట్టిన అధ్యయనం ఫలితాలు గురువారం న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. ఎడిన్‌బరో, స్ట్రాత్‌క్లైడ్‌ యూనివర్సిటీలు, పబ్లిక్‌ హెల్త్‌ స్కాంట్లాండ్‌ కలిసి ఏప్రిల్‌ 1– సెప్టెంబర్‌ 27వ తేదీల మధ్య స్కాట్లాండ్‌లోని 54 లక్షల మంది డేటాను విశ్లేషించాయి. వ్యాక్సినేషన్‌ జరుగుతున్న ఈ సమయంలోనే 1,15,000 మంది కరోనా బారినపడగా, వీరిలో 201 మంది చనిపోయారు. బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడటంలో ఫైజర్‌ టీకా 90 శాతం, కోవిషీల్డ్‌ 91% సమర్థవంతంగా పనిచేసినట్లు గుర్తించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top