చైనా తాజాగా చేసిన భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 3వ తేదీ) గోబీ ఎడారిలోని జియుక్వాన్ సెంటర్ నుంచి ప్రయోగించిన టియాన్‌లాంగ్-3 రాకెట్ మధ్యలో లోపం రావడంతో మిషన్ విఫలమైంది.
ఇది స్పేస్ ఎక్స్ (SpaceX Falcon 9) స్టార్‌లింక్‌కు పోటీగా పోటీగా అభివృద్ధి చేసిన చైనాలోని అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం ఇది. అయితే ఈ ప్రయోగం విఫలమైంది. చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విఫలం కావడాన్ని ధృవీకరించింది. తాము ప్రయోగించిన టియాన్‌లాంగ్-3 రాకెట్ ప్రయోగం విఫలమైందని పేర్కొంది.
టియాన్‌లాంగ్-3ను చైనా Starlink వంటి ఇంటర్నెట్ శాటిలైట్ మెగా-కాన్స్టెల్లేషన్లను ఏర్పాటు చేయడానికి కీలకంగా భావించింది. SpaceX Falcon 9కి ప్రత్యామ్నాయంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది విఫలం కావడం చైనాలోని ప్రైవేట్ స్పేస్ రంగానికి పెద్ద దెబ్బ, ముఖ్యంగా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులలో ఆలస్యం అవుతుంది.
ప్రయోగం వివరాలు
రాకెట్ పేరు: టియాన్‌లాంగ్-3
అభివృద్ధి సంస్థ: బీజింగ్ ఆధారిత స్టార్టప్ స్పేస్ పయినీర్
ప్రయోగ స్థలం: జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్, గోబీ ఎడారి
ప్రయోగ సమయం: ఏప్రిల్ 3, 2026, మధ్యాహ్నం 12:17 (స్థానిక సమయం)
లోపం: మధ్యలో “flight anomaly” కారణంగా రాకెట్ విఫలమైంది


