ఒక్కరోజులో మూడున్నర కోట్ల కేసులు.. చరిత్రలో అతిపెద్ద వైరస్‌ సంక్షోభానికి వేదిక అదేనా?

China May Witness World Largest Virus Outbreak - Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్‌ సంక్షోభానికి చైనా వేదిక కానుందా?.. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అవుననే అంటున్నారు అంతర్జాతీయ వైద్య నిపుణులు. ఒక్క రోజులో మూడున్నర కోట్ల మంది వైరస్‌ బారిన పడొచ్చని భావిస్తున్నారు. అదీ ఈ వారంలోనే సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక దేశంలో.. ఒక్కరోజులో ఈ స్థాయిలో వైరస్‌ కేసులు నమోదు అయ్యింది లేదు. తద్వారా.. అతిపెద్ద వైరస్‌ వ్యాప్తికి డ్రాగన్‌ కంట్రీ వేదిక కానుందన్నమాట. ఇక చైనాలో కరోనా కల్లోలం ఊహించని స్థాయిలో కొనసాగుతోంది. జీరో కోవిడ్‌ పాలసీ దారుణంగా బెడిసి కొట్టి.. జనాలు వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే 24 కోట్ల మందికిపైగా (అంటే దేశ జనాభాలో 18 శాతం) గత ఇరవై రోజుల్లోనే వైరస్‌ బారిన పడ్డారు. ఈ మేరకు చైనా జాతీయ హెల్త్‌ కమిషన్‌ బుధవారం నిర్వహించిన అంతర్గత సమావేశం ద్వారా ఈ విషయం బయటకు పొక్కింది.

ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్‌ నుంచి ప్రమాదకరమైన వేరియెంట్లు పొక్కుతుండడంతో.. సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు అక్కడి జనం ప్రయత్నిస్తున్నారు. సిచువాన్‌ ప్రావిన్స్‌లో ఇప్పటికే సగం జనాభా వైరస్‌ బారిన పడింది. రాజధాని బీజింగ్‌ సైతం కరోనా కేసులో అల్లలాడిపోతోంది.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top