చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!

Children Help Build Barricades To Stop Russian Invasion In Odessa - Sakshi

Build Barricades To Stop Russian Invasion: ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నిరవధికంగా సాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అతలాకుతలమై పోయింది. అంతేగాక ప్రధాన నగరాలను ఒక్కొకటిగా రష్యా బలగాలు మోహరించడమే కాక కైవసం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరమైన ఒడెస్సాలో రష్యా దాడి చేయనుందంటూ తరుచుగా సైరన్‌లు మోగుతున్నాయి.

దీంతో ఆ నగరంలోని సిటీ సెంటర్‌ను అడ్డుకునేందుకు స్థానికులు ఇసుకుతో బారికేడ్లను నిర్మించేందుకు ఉపక్రమించారు. ఆ బారికేడ్‌ నిర్మాణం పనుల్లో పదకొండేళ్ల పిల్లలు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ చిన్నారులు తమ నగరంలో రష్యా దళాలు ప్రవేశించనివ్వమని, నిర్మాణం సజావుగా సాగుతోందని చెబుతున్నారు. అయితే ఓడరేవు నగరం ఖేర్సన్‌ను రష్యా బలగాలు గురువారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు మైకోలైవ్‌ నగర కేంద్ర నుంచి రష్యా దళాలు ప్రవేశించకుండా స్థానిక వేటగాళ్లు నిలువరించడమే కాకుండా సఫలమయ్యారు కూడా. ఈ మేరకు ఉక్రెయిన్‌లో కొన్ని నగరాల్లోని ప్రజలు తమ పోరాటంతో కొంత మేర విజయాన్ని సాధించాయనే చెప్పాలి. రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో దాదాపు 750 మందికి పైగా పౌరులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు పోరాటం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.2 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టారు కూడా.

(చదవండి: పారిపోలేదు!..నేను ఇక్కడే ఉన్నా! పోరాడుతున్నా: జెలెన్‌ స్కీ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top