Brain Eating Amoeba Deaths: మనిషి మెదడును తినేసే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు వార్నింగ్..

Brain Eating Amoeba Kills South Korean Man Naegleria Fowleri - Sakshi

సియోల్‌: దక్షిణ కొరియాలో 'నాయ్‌గ్లేరియా ఫాలెరీ' తొలి మరణం నమోదైంది. ఈ వ్యాధి సోకి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీన్నే 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అని కూడా పిలుస్తారు. డిసెంబర్‌ 10న థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి(50) ఆ మరునాడే ఆస్పత్రిలో చేరాడని, గత మంగళవారం చనిపోయాడని  అధికారులు వివరించారు. దేశంలో ఇదే తొలి కేసు అని దక్షిణ కొరియా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.

బ్రెయిన్ ఈటింగ్ ‍అమీబా 1937లో అమెరికాలో తొలిసారి వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. మనిషి ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది.

అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. అయినా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వ్యక్తి నివసించే ప్రాంతంలోని ప్రజలు.. కొలనులు, కాలువల్లోకి దిగి ఈత కొట్టవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు.  అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా కొరియాలోనూ వెలుగుచూసింది.
చదవండి: కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top