breaking news
Brain Eating Amoeba
-
‘మెదడును తినే అమీబా’ కలకలం.. ఈ ఏడాదిలోనే 19 మంది మృతి!
న్యూఢిల్లీ: కేరళలో ‘మెదడును తినే అమీబా’ కేసులు కలకలం రేపుతున్నాయి. అధిక మరణాల రేటు కలిగిన మెదడు ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పామ్) కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తుంది. దీనిని సాధారణ బాషలో ‘మెదడును తినే అమీబా’ అని పిలుస్తారు. ఈ ఏడాది కేరళలో ఈ తరహాలో 61 పామ్ కేసులు నమోదయ్యాయి. 19 మరణాలు సంభవించాయి. వీటిలో పలు మరణాలు గత కొన్ని వారాలలోనే నమోదయ్యాయి.కేరళ ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సవాలుతో పోరాడుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. గతంలో కోజికోడ్, మలప్పురం తదితర జిల్లాల్లోని క్లస్టర్లతో ముడిపడి ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. బాధితుల జాబితాలో మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వయస్సు వారి వరకు ఉన్నారని తెలిపారు. కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ‘పామ్’ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పలు సందర్భాలలో ఇది తీవ్రమైన మెదడు వాపు, మరణానికి దారి తీస్తుంది. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్లు, యువకులకు సోకుతుంది.మెదడును తినే అమీబా అనేది నిలిచిపోయిన నీరులో కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ అమీబాతో కలుషితమైన నీటి వనరులలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా స్నానం చేసేవారికి ఈ అమిబీ సోకే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. పామ్ కేసులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని నిర్ధారించడం కష్టమని నిపుణుల చెబుతున్నారు. అయితే దీని లక్షణాలు బాక్టీరియల్ మెనింజైటిస్ లాంటివి.. అంటే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు. ‘పామ్’ సోకినప్పుడు ఈ లక్షణాలు ఒకటి నుండి తొమ్మిది రోజుల మధ్య కనిపించే అవకాశాలున్నాయి. కేరళలో 2016లో తొలి ‘పామ్’ కేసు నమోదయ్యింది. గత ఏడాది నుంచి ఈ కేసులలో పెరుగుదల కనిపించింది . కొత్త ఇన్ఫెక్షన్లను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చెరువులు, సరస్సులు వంటి శుద్ధి చేయని లేదా నిలిచిపోయిన నీటి వనరులలో ఈత కొట్టటం లాంటి పనులు చేయవద్దని కేరళ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. -
kerala: బాలికను బలిగొన్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా.. మరో మూడు కేసులు నమోదు
కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా(అమీబిక్ ఎన్సెఫాలిటిస్) కలకలం సృష్టిస్తోంది. ఈ అరుదైన వ్యాధికి గురైన తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలొదిలింది. నేగ్లేరియా ఫౌలేరి జిల్లాలో ఇదే తరహాలో మరో మూడు కేసులను ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపధ్యంలో ప్రజారోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.కలుషిత నీటిలో కనిపించే ఈ అరుదైన అమీబా మానవ మెదడు ఇన్ఫెక్షన్కు కారణమవుతుందని నిపుణులు తెలిపారు. అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం వారం రోజుల క్రితం ఒక బాలికకు తీవ్ర జ్వరం రావడంతో, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధిత బాలికను కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. ఈ ఏడాది జిల్లాలో ఈ తరహా కేసులలో ఇది నాల్గవది.అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అంటే..వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది మెదడుకు సోకే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. దీనిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) ,గ్రాన్యులోమాటస్ అమీబిక్ ఎన్సెఫాలిటిస్ (GAE). ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌కు ప్రధాన కారణం నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా. ఈ అమీబా మెదడు కణజాలాన్ని నాశనం చేసి, మెదడు వాపుకు దారితీస్తుంది. చాలా సందర్భాల్లో ఇది మరణానికి కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా అరుదుగా కనిపించినప్పటికీ, కౌమార దశలోనివారికి సోకుతుండటాన్ని నిపుణులు గమనించారు. కలుషితమైన నీటిలో మునిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నదులు, చెరువులు, కాలువలలో ఈతకు దిగేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు తెలిపారు.లక్షణాలు- నివారణవైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు ఇబ్బంది పెడతాయి. వ్యాధి తీవ్రమైన తరుణంలో మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ, కోమా తదితర సమస్యలు సమస్యలు తలెత్తవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ 18 రోజుల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వ్యాధి నివారణకువైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. పిల్లలను చెరువులు లేదా నిలిచిన నీటిలో స్నానం చేయనివ్వకూడదని సూచించారు. స్విమ్మింగ్ పూల్స్, వాటర్ థీమ్ పార్క్‌లలో నీటిని క్లోరినేట్ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. కలుషిత నీటికి దూరంగా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. -
షాకింగ్.. మనిషి మెదడును తినేసే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం..
సియోల్: దక్షిణ కొరియాలో 'నాయ్‌గ్లేరియా ఫాలెరీ' తొలి మరణం నమోదైంది. ఈ వ్యాధి సోకి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీన్నే 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అని కూడా పిలుస్తారు. డిసెంబర్ 10న థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి(50) ఆ మరునాడే ఆస్పత్రిలో చేరాడని, గత మంగళవారం చనిపోయాడని అధికారులు వివరించారు. దేశంలో ఇదే తొలి కేసు అని దక్షిణ కొరియా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారి వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. మనిషి ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. అయినా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వ్యక్తి నివసించే ప్రాంతంలోని ప్రజలు.. కొలనులు, కాలువల్లోకి దిగి ఈత కొట్టవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా కొరియాలోనూ వెలుగుచూసింది. చదవండి: కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్..