జెఫ్‌ బెజోస్‌ టాప్‌ : మరో రికార్డు

Amazon Bezos tops list of richest charitable gifts in 2020 - Sakshi

2020 విరాళాల జాబితా:  టాప్‌లో అమెజాన్‌ సీఈఓ  జెఫ్‌ బెజోస్‌

వాతావ‌ర‌ణ మార్పుల‌కు వ్య‌తిరే పోరాటానికి మ‌ద్ద‌తుగా ప‌ది బిలియ‌న్ డాల‌ర్ల విరాళం

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు వాతావరణ మార్పులపై పోరాటానికి  మద్దతుగా  భూరి విరాళాన్ని అందించిన బెజోస్‌ 2020లో అతిపెద్ద విరాళం ఇచ్చిన వ్య‌క్తిగా నిలిచారు. ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.73 వేల కోట్లు)భారీ మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు  వితరణ చేశారు. తద్వారా సంపాదన ఆర్జనలోనే కాదు విరాళాలివ్వడంలో కూడా తానే మేటి అని నిరూపించుకున్నారు. ‘ది క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ’ ప్రకటించిన వార్షిక జాబితాలో  అమెజాన్‌ సీఈఓ ముందు వరసలో నిలిచారు. వాతావరణ మార్పులపై పోరాటానికి ఉద్దేశించి ఆయన ఈ విరాళాలను అందజేశారు.  ఈ విరాళంతో బెజోస్ ఎర్త్ ఫండ్‌ను ప్రారంభించిన‌ట్లు క్రానిక‌ల్ ఆఫ్ ఫిలాంత్రఫీ  ప్రకటించింది.

2020లో బెజోస్ విరాళం కాకుండా మిగిలిన టాప్ 10 విరాళాల మొత్తం కేవ‌లం 260 కోట్ల డాల‌ర్లు మాత్ర‌మే.  2011 త‌ర్వాత ఇంత త‌క్కువ స్థాయిలో విరాళాలు రావ‌డం ఇదే తొలిసారి. 2020లో బెజోస్ సంప‌ద కూడా 2020, మార్చి 18 నుంచి డిసెంబ‌ర్ 7 మ‌ధ్య ఏకంగా 60 శాతం పెరిగింది. ఫోర్బ్స్‌  అంచనాల ప్రకారం 18800 కోట్ల డాల‌ర్ ల(సుమారు రూ.13.75 ల‌క్ష‌ల కోట్లు) సంప‌ద బెజోస్‌ సొంతం.  బెజోస్‌ తర్వాత గత సంవత్సరం భారీ మొత్తంలో విరాళాలిచ్చిన వారి జాబితాలో నైక్‌ వ్యవస్థాపకుడు ఫిల్‌నైట్‌ అతని భార్య పెన్నీ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. లాక్‌డౌన్‌ సమయంలో ( మార్చి-డిసెంబర్ ) వీరి సంపద 77 శాతం పుంజుకుంది.  వీరిద్దరూ నైట్ ఫౌండేషన్‌కు  900 మిలియన్లు డార్లు, ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి  300 మిలియన్ల డాలర్లు డొనేట్‌  చేశారు. ఇక ఈ జాబితాలో ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌, భార్య ప్రిస్కల్లా చాన్‌ నాల్గవ స్థానంలో  ఉన్నారు.  వీరు 250 మిలియన్ డాలర్లను సేవ కార్యక్రమాల కోసం అందించారు.మరోవైపు గత సంవత్సరం స్వచ్ఛంద సంస్థకు భారీగా విరాళం ఇచ్చిన ఇద్దరు బిలియనీర్లు బెజోస్ మాజీ భార్య మాకెంజీ స్కాట్, ట్విటర్‌ కో ఫౌండర్‌జాక్ డోర్సే క్రానికల్ ఈ  సారి జాబితాలో చోటు దక్కించుకోలేదు. ఫిబ్రవరిలో, క్రానికల్  50 అతిపెద్ద దాతల జాబితాను ప్రచురించనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top