Viral Video: Russia 73 Years Old Man Skating Skills Will Amaze You - Sakshi
Sakshi News home page

వయసు 73 ఏళ్లు మరచిపోండి.. ఆయన ప్రతిభను చూడండి

Sep 11 2021 3:46 PM | Updated on Sep 11 2021 7:33 PM

73 Year Old Man Surprises With Her Skatboarding In Russia - Sakshi

స్కేటింగ్‌ ఒక రకంగా సాహస క్రీడ. అప్రమత్తంగా లేకుంటే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఎంతో శిక్షణతో నేర్చుకుని అన్ని జాగ్రత్తలతో చేస్తుంటే ఆ మజానే వేరు. రోజురోజుకు స్కేటింగ్‌పై ప్రజలకు మక్కువ పెరుగుతోంది. అయితే స్కేటింగ్‌ అంటే కుర్రాళ్లు మాత్రమే చేస్తారా? నేను కూడా ఓ తాతయ్య రంగంలోకి దూకాడు. కుర్రాళ్లకు దీటుగా ఆయన స్కేటింగ్‌ చేస్తూ జాలీగా రోడ్లపై తిరిగాడు. ఈ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
చదవండి: చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం

ఈ వీడియో పాతదైనా మరోసారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్యాకు చెందిన 73 ఏళ్ల పెద్దమనిషి ఇగోర్‌ స్కేటింగ్‌పై తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించాడు. స్కేట్‌బోర్డుపై వంగి నిల్చుని జాలీగా రోడ్లపై ఆయన జాలీగా తిరుగుతున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా హాయిగా సంచరిస్తున్నాడు. ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు. మాక్స్‌ తిముకిన్‌ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్‌ చేశాడు. ‘73 ఏళ్లు వయసు మరచిపోండి. ఆయన 1981 నుంచి స్కేట్‌బోర్డును రఫ్ఫాడిస్తున్నాడు’ అంటూ పోస్టు చేశాడు. కారు కన్నా స్కేట్‌ బోర్డు మేలు అని ఇగోర్‌ చెప్పడం చూస్తుంటే ఆయనకు స్కేటింగ్‌ అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది.
చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement