సవతి కొడుకుతో ప్రేమ.. భర్తకు విడాకులిచ్చి కొత్త కాపురం.. ఇప్పుడేమో!

37Year Old Woman Has Second Baby With Stepson Son - Sakshi

రష్యాలో ముక్కున వేలేసుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ 45 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే అతనికి ఏడేళ్ల బాబు ఉన్నాడు. కొన్నేళ్లు వాళ్ల కాపురం సజావుగానే సాగింది. కాలంతోపాటు ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాడు. తర్వాత కొంత కాలానికి భర్త ఉండగానే సవతి కొడుకుతో ఆ మహిళ ప్రేమలో పడింది. దీంతో భర్తకు విడాకులు ఇచ్చి ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు. వినడానికే విడ్డూరంగా ఉన్న ఈ విషయం పూర్తిగా అర్థం కావాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

అలెక్సీ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో మెరీనా బల్మషేవా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అలెక్సీ రెండో పెళ్లి చేసుకునే సమయంలో అతనికి ఏడేళ్ల వయసున్న వోవా అనే కుమారుడు ఉన్నాడు. వోవా కొద్ది కాలంలోనే మెరీనాకు దగ్గరయ్యాడు. వీరి ఇద్దరి మధ్య బంధం బలపడింది. మెరీనాకు  తన సవతి కొడుకు తనపై చూపిస్తున్న ప్రేమ గురించి అర్థమైంది.

అది తల్లి కొడుకుల అనుబంధం కాదని, అంతకు మించి అని అర్థం చేసుకుంది. ఇద్దరం కలిసి జీవిద్దామని, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పటికీ వోవా వయసు 20 ఏళ్లు. సవతి కొడుకుతో మెరీనా గర్భం దాల్చడంతో భర్తకు విడాకులు ఇచ్చేసి అతన్ని పెళ్లి చేసుకుంది. అంతేగాక భర్తగా మారిన సవతి కొడుక్కి మరింత అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకుంది. ఈ జంటకు 2021లో కూతురు పుట్టింది. తాజాగా మెరీనా మరో పాపకు జన్మనిచ్చింది. దీంతో వీళ్ల వ్యవహారం మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే వీరిద్దరి బంధంపై మెరీనా భర్త.. అలెక్సీ షావిరిన్ తీవ్ర విమర్శలు చేశాడు. అతను ఇంట్లో ఉండగానే ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారని తెలిపాడు. ‘నా కొడుక్కి అంతకుముందు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఎవరూ లేరు. మెరీనా అతన్ని మాయ చేసి బుట్టలో వేసుకుంది. తను ఇంకా ఎవరిని అయినా పెళ్లి చేసుకున్నా క్షమించేవాడిని. కానీ నా కొడుకును ప్రేమించినందుకు జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఇంట్లో ఉన్న సమయంలోనూ వాళ్లు ఒకే గదిలో గడిపేవారు. వాళ్ల రహస్య బంధం తెలిసి విడాకులు తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. 
చదవండి: నా మొగుడు ఏం చేసినా పర్లేదు.. అమ్మాయిలతో తిరిగినా నాకు కావాల్సింది అదే!

ఈ విషయంపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తూ.. తల్లి, బిడ్డల మధ్య ఉన్న సంబంధానికి కళంకం తెచ్చిపెట్టావంటూ మండిపడుతున్నారు. కానీ, మరికొంత మంది మాత్రం.. అతడు సవతి కొడుకని, అందులోనూ భర్తతో విడాకులు తీసుకోవడంతో ఆమెకు ఆ కుటుంబానికి సంబంధం లేకుండా పోయిందని, వాళ్లు పెళ్లి చేసుకోవడం తప్పేమీ కాదని మద్దతుగా నిలుస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top