వైరల్‌: వేటగాళ్ల క్రూరత్వం.. తీరం మొత్తం రక్త సిక్తం..

175 Pilot Whales Was Assassinated By Faroe Islands Hunters - Sakshi

మనిషిని సంప్రదాయం పేరిట ఉండే మూఢ నమ్మకం పిచ్చివాడిని చేస్తుంది. మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్‌ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతువులు ఇప్పుడు లేవు.  ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతుజాతులు కనుమరుగైపోతున్నాయి. పూర్వం వన్యప్రాణులను రకరకాల కారణాల వల్ల వేటాడుతుండేవారు. కొందరు తమ బలప్రదర్శన, ధైర్య సాహసాలు నిరూపించుకోవడం కోసం జంతువులను వేటాడి చంపేవారు.

ఫారో ఐస్‌లాండ్స్(తోర్షావ్న్): ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన ఫ్రోస్లోని గ్రిన్‌డ్రాప్‌ లేదా గ్రైండ్‌ అని పిలిచే ద్వీపంలో ఆదివారం చోటు చేసుకుంది. దాదాపు 20 పడవల్లో వచ్చిన వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. సముద్ర తీర ప్రాంతంలో ఓ చోట 52 పైలట్‌ తిమింగలాలను చంపగా.. మరో చోట 123 తిమింగలాలను హతమార్చారు. దీంతో సముద్ర తీరం మొత్తం రక్త సిక్తమైంది. ఈ విధంగా గత దశాబ్ద కాలంలో 6,500 పైగా తిమింగలాలు, డాల్ఫిన్‌లను బలితీసుకున్నారు. ఇదో అనాగరికమైన చర్యగా సీ షెపర్డ్‌ పేర్కొంది.
 
ఇలా వెలుగులోకి..
సీ షెపర్డ్ పరిరక్షణకారులు ఓ డ్రోన్‌ను పంపించారు. అది తిమింగలాలు ఉండే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఈ సంగతి బయట పడింది. అయితే ఆ సమయంలో ఓ ముష్కరుడు  ఫోర్‌మ్యాన్‌ను వేటాడండి అంటూ.. డ్రోన్‌పై షాట్‌గన్‌తో కాల్పులు జరిపాడు. ఇక దీనిపై ఫారో దీవుల్లోని వారు కొన్ని గ్రూపులుగా విడిపోయాయి. కానీ చాలామంది వారి సంస్కృతిని గౌరవించాలని  విదేశీ మీడియా, ఎన్జీఓలను కోరుతున్నారు. తిమింగలం మాంసం చాలా మంది స్థానికులు తింటారు. అయితే ఈ విధంగా భారీగా హతమార్చడాన్ని భరించలేమని వాటి పరిరక్షకులు వాదిస్తున్నారు.

చదవండి:
Covaxin: భారత్‌ బయోటెక్‌కు మరోసారి ఎదురుదెబ్బ
జాకబ్‌ జుమాకు 15నెలల జైలు శిక్ష 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top