రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

గచ్చిబౌలి: కొండాపూర్‌ ఆస్పత్రిని వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ పేర్కొన్నారు. కొండాపూర్‌లోని జిల్లా స్థాయి ఆస్పత్రిలో గురువారం కూ.40.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన నిర్మాణానికి, డయాగ్నస్టిక్స్‌హబ్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటుతో నగరానికి వెళ్ళాల్సిన పనిలేకుండా ఇక్కడే అందుబాటులో వైద్య సేవలు వస్తాయన్నారు. ఈ ఆస్పత్రిలోని 16 విభాగాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సకు అవసరమయ్యే నాణ్యమైన వైద్యం అందించే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రిని పరిశీలించి వైద్యసౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ

కొండాపూర్‌ ఆస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు శంకుస్థాపన

Advertisement
 
Advertisement
Advertisement